క్రైమ్/లీగల్

జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ తొలి చార్జిషీటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 23: ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్‌ఐఏ) కోర్టులో ప్రిలిమనరీ ఛార్జిషీటు దాఖలు చేసింది. అయితే దాడికి సంబంధించి విచారణ మాత్రం కొనసాగిస్తామని కోర్టుకు ఎన్‌ఐఏ తెలియచేసింది. ఇదిలావుండగా మరోవైపు.. కేసుకు సంబంధించి డాక్యుమెంట్లు ఎన్‌ఐఏకు అప్పగించలేమని ఏపీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కోర్టుకు తెలిపింది. ఎన్‌ఐఏ దర్యాప్తుకు వ్యతిరేకంగా ఇప్పటికే హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున ఇవ్వడం సాధ్యపడదని పేర్కొంటూ ఎన్‌ఐఏ కోర్టులో సిట్ మెమో దాఖలు చేసింది. ఈ రెండు అంశాలపైనా.. ఇటు సిట్, ఎన్‌ఐఏ, మరోవైపు నిందితుని తరఫు న్యాయవాదులు బుధవారం విజయవాడలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్ధానంలో సుదీర్ఘ వాదనలు వినిపించారు. ప్రత్యేక కోర్టుకు వచ్చిన ఎన్‌ఐఏ అధికారులు ఛార్జిషీటు పత్రాలను న్యాయమూర్తికి సమర్పించారు. ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఛార్జిషీటులో మొదటి ముద్దాయిగా పేర్కొన్నారు. అదేవిధంగా శ్రీనివాసరావు జైలులో రాసుకున్న 22పేజీల పుస్తకాన్ని ఛార్జిషీటుతోపాటు ఎన్‌ఐఏ జత చేసింది. ఛార్జిషీటు కాపీని ఎవరికీ అందకుండా చూడాలని, గోప్యంగా ఉంచాలని కోర్టు సిబ్బందిని ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జనుపల్లి శ్రీనివాసరావును ఛార్జిషీటులో నిందితునిగా పేర్కొనప్పటికీ కుట్రకోణంపై, దాడికి గల కారణాలపై విచారణ కొనసాగిస్తామని కోర్టుకు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. కాగా ఛార్జిషీటులో పేర్కొన్న అంశాలు మాత్రం ఈనెల 25వ తేదీన బయటకు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నిందితుడు శ్రీనివాసరావు రిమాండు గడువు ఆ రోజుతో ముగియనుంది. దీంతో తిరిగి అతడిని వాయిదా సందర్భంగా 25న కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. కాగా ఎన్‌ఐఏ దాఖలు చేసిన ఛార్జిషీటును కోర్టు పరిగణనలోకి తీసుకుని నెంబర్ అయిన మీదట కాపీలను నిందితునితోపాటు పలువురికి ఇవ్వాల్సి ఉంటుందని న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఈ కేసులో పలు పిటిషన్లు ఇప్పటికే పెండింగ్‌లో ఉండగా అత్యవసరంగా ఛార్జిషీటు దాఖలు చేయాల్సిన అవసరం ఏముందని పేర్కొన్న నిందితుని తరఫు న్యాయవాది ఛార్జిషీటు కాపీలు కావాలని కోరగా.. ఇప్పుడెందుకు అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు.
డాక్యుమెంట్లు ఇవ్వలేం : సిట్
ఇదిలావుండగా.. కేసుకు సంబంధించి దర్యాప్తు పత్రాలు, సాక్ష్యాలు, డాక్యుమెంట్లు ఎన్‌ఐఏకు అప్పగించలేమని రాష్ట్ర పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం చెప్పింది. కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ తన విచారణకు సిట్ సహకరించడంలేదని గతంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రికార్డులు ఇవ్వడం లేదని కోర్టు దృష్టికి తీసుకురాగా వెంటనే కేసు దర్యాప్తుకు సంబంధించి అన్ని పత్రాలు ఎన్‌ఐఏకు అప్పగించాలని ఈనెల 19న సిట్ అధికారి నాగేశ్వరరావును కోర్టు ఆదేశించింది. అయితే దీనిపై అభ్యంతరం తెలుపుతూ ఎన్‌ఐఏ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తు ఎన్‌ఐఏకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉందని, అందువల్ల డాక్యుమెంట్లు ఇవ్వలేమని సిట్ తెలిపింది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న వ్యవహారమని, హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని, కింది కోర్టుకు ఆదేశించే అర్హత లేదని సిట్ పేర్కొంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలతో ఈనెల 30లోగా కేంద్రం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది.