క్రైమ్/లీగల్

పేలిన గ్యాస్ సిలిండర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 25: జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ పద్మావతీ కాలనీ ప్రధాన రహదారిపై గల ఒక టీ కొట్టులో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురికి గాయాలు కాగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం ఉదయం మున్సిపల్ సిబ్బంది ప్రధాన రహదారిపై చెత్తను ఊడుస్తూ సేకరించిన చెత్తను తగబెడుతుండగా నిప్పురవ్వలు ఎగిసిపడి టీకొట్టు డబ్బాపై పడడంతో గ్యాస్ సిలిండర్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న మున్సిపల్ సిబ్బందికి మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసి గాయాలు అయిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించగా అందులో సుజాత అనే మహిళకు తీవ్రంగా గాయపడింది. పలువాహనాలు కూడా ధ్వంసం కావడంతో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల పట్టణంలోని పలు రహదారుల వెంట టీ కొట్టు డబ్బాలు వెలిశాయని దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. జిల్లాలో పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరిగిన కూడా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనాలకు విరుద్ధంగా డబ్బాలను నెలకొల్పిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తేనెటీగల దాడి
కుభీర్, జనవరి 25: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని సాంలీ గ్రామంలో శుక్రవారం శవయాత్ర నిర్వహిస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడిచేశాయి. పొగ, డప్పు చప్పుళ్లకు చెట్టుపైన ఉన్న తేనెటీగలు ఒకేసారి లేచి దాడిచేశాయి. తేనెటీ గల దాడిలో గాయాలైన లక్ష్మణ్, పార్వతీబాయి, సరస్వతీబాయి, సుశీల, సులోచన, పీరాజీలను భైంసా ఏరియా ఆసుపత్రిలో చికిత్సలు జరిపిస్తున్నారు.