క్రైమ్/లీగల్

ఈబీసీ కోటాపై స్టే ఇవ్వలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: అగ్ర వర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్యా, ఉపాధి అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టంపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా 103 రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రం చేసిన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లుపై మూడు వారాలలో కేంద్ర తమ వైఖరి తెలియజేయాలని సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. 10 శాతం రిజర్వేషన్లు చట్టాన్ని సవాల్ చేస్తూ యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద సంస్థ, వ్యాపారవేత్త తెహసిన్ పూనావాలాతో పాటు జనహిత్ అభియాన్ పిటిషన్లును సుప్రీం కోర్టులో దాఖలు చేశాయి. కేంద్రం తీసుకోచ్చిన ఈ చట్టం రాజ్యాంగ నియామాన్ని ఉల్లంఘించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే రిజర్వేషన్ల కల్పనలో ఆర్థిక ప్రమాణాలు ఆధారంగా రిజర్వేషన్లు 1992లో ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు తొమ్మిది మందితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పును కేంద్రం ఉల్లఘింస్తూ ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. పలు కేసులలో 50 శాతం రిజర్వేషన్ల మించి మించకుడదని ఇచ్చిన తీర్పులను కూడా ఈ పిటిషన్‌లో ప్రస్తవించారు. 10 శాతం రిజర్వేషన్లు పెంచుతూ కేంద్రం తీసుకున్నా ఈ నిర్ణయం సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ పిటిషన్లు శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగయ్, జస్టిస్ సంజీవ్ కన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఈ పిటిషన్లును స్వీకరించిన ధర్మాసనం, వీటిపై సుదీర్ఘంగా విచారణ జరగాల్సిం వుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ రిజర్వేషన్ల చట్టంపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ పిటిషన్లుపై మూడు వారాలలో తమ వైఖరీ తెలియజేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.