క్రైమ్/లీగల్

రేపటి ‘అయోధ్య’ విచారణ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ముందు ప్రకటించినట్లుగా అయోధ్య రామజన్మభూమి వివాదం కేసు విచారణను ఈ నెల 29వ తేదీ మంగళవారం చేపట్టడం లేదని సుప్రీం కోర్టు ప్రకటించింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే మంగళవారం అందుబాటులో ఉండనందు వల్ల 29న కేసు విచారణను రద్దు చేస్తున్నట్లు కోర్టు రిజిస్ట్రీలో ప్రకటించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ ఇటీవలనే ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ నెల 29వ తేదీన ఈ కేసు విచారణ ప్రారంభమవుతుందని కోర్టు ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కాగా ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్‌గగోయ్, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్ ఉన్నారు. ఒక న్యాయమూర్తి అందుబాటులో లేనందు వల్ల 29వ తేదీన అయోధ్య
అంశంపై రాజ్యాం ధర్మాసనం విచారణ ఉండదని రిజిస్ట్రీలో పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన ఈ కేసు విచారణ ప్రారంభంలోనే జస్టిస్ లలిత్ ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం గమనార్హం. అనంతరం ప్రధాన న్యాయమూర్తి ఐదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో అంతకుముందు ధర్మాసనంలో ఉన్న జస్టిస్ ఎన్‌వీ రమణ కూడా లేకపోవడం గమనార్హం. అలహాబాద్ హైకోర్టు 2010లో అయోధ్య అంశంపై తీర్పు ఇచ్చింది. 2.77 ఎకరాల భూమిని ఈ కేసులో నాలుగు పార్టీలకు విభజించి కేటాయించింది. కాగా ఈ తీర్పును సవాలు చేస్తూ అనేక పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.