క్రైమ్/లీగల్

ఇంజనీరింగ్ ఫీజులపై విచారణ 19కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: తెలంగాణలోని వాసవి, శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేయడంపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ ఫిబ్రవరి 19కి వాయిదా పడింది. ఈ రెండు కళాశాలల్లో అధిక ఫీజుల వసులుపై తెలంగాణ ప్రభుత్వం, పేరెంట్సే అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ శరణ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది రాకేశ్ దివ్వేది వాదనలు వినిపిస్తూ ఫీజులను నిర్ణయించే అధికారం హైకోర్టుకు లేదని స్పష్టం చేశారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుని ఇంజనీరింగు కళాశాలల్లో ఫీజులను నిర్ణయించే అధికారం హైకోర్టుకు ఉందా? అని ప్రశ్నించింది. అలాగే కళాశాలల్లో ఫీజుల వివాదాలుంటే ఫీజు నియంత్రణ కమిటీకి పంపాలి కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. కళాశాల తరపున సీనియర్ న్యాయవాది పాలి నారిమన్ వాదనలు వినిపిస్తూ ఫీజులను నిర్ణయించే అధికారం హైకోర్టుకు ఉందని వాదనలు వినిపించారు. ఫీజుల నియంత్రణపై గతంలో 11 మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలకు అనుకులంగా ఉందని వాదించారు. దీనిపై ఇరుప్రక్షాలు ఫిబ్రవరి 10లోగా రాతపూర్వకంగా తమ వాదనలు సమర్పించాలని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది.