క్రైమ్/లీగల్

చిన్నారి సాయిశ్రీ మృతి ఉదంతంపై రిట్ పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 29: గతంలో సంచలనం రేపిన చిన్నారి సాయిశ్రీ ఉదంతం మళ్లీ తెరపైకి వచ్చింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చిన్నారి తల్లి సుమశ్రీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విజయవాడలో నివాసముంటున్న తన ఇంటిని నగర సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మాదంశెట్టి శివకుమార్ కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాల్సిందిగా సూర్యారావుపేట పోలీసులకు తాను గతంలో ఫిర్యాదు చేశానని, అయినా న్యాయం చేయకపోగా, అసలు పట్టించుకోవడం లేదంటూ సుమశ్రీ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మాదంశెట్టి శివతో సుమశ్రీకి పెళ్లయిన తర్వాత సాయిశ్రీ జన్మించింది. తర్వాత కొన్నాళ్లకు మాదంశెట్టితో విభేదించిన సుమశ్రీ పోలినేని కృష్ణకుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈక్రమంలో మాదంశెట్టికి, సుమశ్రీకి మధ్య విభేదాలు సాగుతున్న నేపథ్యంలో కొంతకాలం క్రితం చిన్నారి సాయిశ్రీ మరణించింది. అప్పట్లో ఈ ఉదంతం రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేపింది. అయితే సుమశ్రీ పేరుతో ఉన్న ఇంటి నుంచి తనను వెళ్లగొట్టి కబ్జా చేసిన మాదంశెట్టి, అందుకు సహకరించిన ఎమ్మెల్యే బొండా ఉమాపై పోలీసులకు తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తనకు న్యాయం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, విజయవాడ పోలీసు కమిషనర్, సూర్యారావుపేట పోలీస్టేషన్ హౌసాఫీసర్‌లను ప్రతివాదులుగా పేర్కొంటూ ఆమె రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో హైకోర్టు విచారణను వాయిదా వేసింది.