క్రైమ్/లీగల్

గరీషా గ్యాస్ ఏజెన్సీకి రూ.80వేలు అపరాధ రుసుం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప లీగల్,మార్చి 19: వినియోగదారుల నుంచి అదనంగా డెలివరీ చార్జిని వసూళ్లు చేస్తున్న గరీషా ఏజెన్సీపై ఎంక్వైయిరీలో రుజువైనందున రూ.80వేల అపరాధరుసుంను కడప జిల్లా ఇన్‌చార్జి జేసీ శివారెడ్డి వేసినట్లు ఆమేరకు న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి యు.యు.ప్రసాద్‌కు రిపోర్టును సమర్పించినట్లు ఆయన తెలిపారు. కాగా ఫిబ్రవరి నెలలో ఎన్‌జివో కాలనీ నివాసి అయిన ఎస్.రాజశేఖర్, తండ్రి రామస్వామి అనే అతను న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శికి అర్జీ ఇచ్చారు. ఆ అర్జీలో హెచ్‌పి గ్యాస్, ఇండిన్ గ్యాస్, భారత్ గ్యాస్ డీలర్లు వినియోగదారుల నుంచి రూ.40లు తెలివరి చార్జీల కింద అదనంగా వసూళ్లు చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన కార్యదర్శి సంబంధిత గ్యాస్ యాజమాన్యానికి నోటీసులు పంపారు. అలాగే ఈవిషయంలో విచారణ చేయాల్సిందిగా జాయింట్ కలెక్టర్‌కు నివేదించారు. కాగా పూర్వాపరాలు ఎంక్వైయిరీ ద్వారా పరిశీలించిన ఆయన గ్యాస్ ఏజెన్సీ రూ.40లు వినియోగదారుల నుంచి డెలివరి చార్జి తీసుకున్నట్లు రుజువైందని నివేదిక న్యాయసేవా అధికార సంస్థకు పంపారు. ఈవిషయంలో సంబంధిత కార్యదర్శి రికార్డును పరిశీలించి జేసీ రిపోర్టు ద్వారా బాధితులకు న్యాయం చేశారు.