క్రైమ్/లీగల్

10కోట్లు డిపాజిట్ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: ఆదాయపు పన్ను కేసులో, రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని ఢిల్లీ హైకోర్టు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఆదేశించింది. ఈ కంపెనీపై మొత్తం రూ.249.15కోట్ల ఆదాయపు పన్ను బకాయిలపై విచారణ జరుగుతోంది. ఈ సంస్థలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, సోనియాగాంధీలు వాటాదార్లు. ఈ మొత్తంలో సగం మార్చి 31 లోగా, మిగిలినది ఏప్రిల్ 15లోగా చెల్లించాలని జస్టిస్ ఎ. రవీంద్ర భట్, జస్టిస్ ఎ.కె. ఛావ్లాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కేసును ఏప్రిల్ 24కు వాయిదా వేసింది. నేషనల్ హేరాల్డ్ దినపత్రికకు చెందిన ఆస్తుల యజమాని అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్‌కు చెందిన వాటాలను యంగ్ ఇండియా కొనుగోలు చేసింది.