క్రైమ్/లీగల్

సోషల్ మీడియాలో సీఎంపై దుష్ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, మార్చి 19: సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్‌ను, నల్లగొండ ఎస్పీ ఎ.వి.రంగనాథ్‌ను విమర్శిస్తూ దుష్ప్రచారం చేసిన హైద్రాబాద్ వాసి అనంచిన్న వెంకటేశ్వర్‌రావును అరెస్టు చేసి సోమవారం కోర్టుకు రిమాండ్ చేసినట్టు నల్లగొండ టూటౌన్ ఎస్‌ఐ మధు తెలిపారు. ప్రజల్లో పోలీసుల ప్రతిష్ట దెబ్బతీసే రీతిలో వాట్సాప్ గ్రూపుల్లో కథనాలు పోస్టు చేశాడని వెంకటేశ్వర్‌రావుపై రాష్ట్ర పోలీస్ సంఘం కోఆప్షన్ సభ్యులు, ఎస్‌బి హెడ్ కానిస్టేబుల్ బుక్క రాజు సోమయ్య ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. అతడి నుండి నాలుగు సెల్‌ఫోన్లు, నాలుగు సిమ్‌లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని ఎఫ్‌ఎస్‌ఎల్, సైబర్‌సెల్‌కు పంపినట్టు తెలిపారు. ఒక దినపత్రిక న్యూస్ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న వెంకటేశ్వర్‌రావు డాక్టర్ శ్రీరాం, దుబాయ్ సుబ్బు 99పి పేర్లతో జర్నలిస్టు డైరీ వాట్సాప్ గ్రూప్‌లో చేరి అభ్యంతరకర పోస్టులను పెట్టినట్టు విచారణలో అంగీకరించాడన్నారు. అతడిపై గతంలో కరీంనగర్ వన్‌టౌన్, వరంగల్ జిల్లా మట్వాడ, ఖమ్మం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదైనట్టు ఎస్‌ఐ తెలిపారు. నల్లగొండ ఎస్పీ రంగనాథ్ గతంలో ఖమ్మం ఎస్పీగా పనిచేసిన కాలంలో వెంకటేశ్వర్‌రావుపై ఖమ్మం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని, ఇప్పుడు నల్లగొండ ఎస్పీగా రంగనాథ్ విధుల్లో చేరిన సందర్భంగా నిందితుడు ఎస్పీపైనా, సీఎంపైనా దుష్ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశాడని ఎస్‌ఐ వివరించారు.