క్రైమ్/లీగల్

కెటిపిఎస్ 7వ దశలో ప్రమాదశాత్తూ కార్మికుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ, ఫిబ్రవరి 9: స్థానిక కెటిపిఎస్ 7వ దశ కర్మాగారంలో ఒక కార్మికుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలావున్నాయి. బీహార్ రాష్ట్రం శివాన్ జిల్లా, అస్సాపూర్ గ్రామానికి చెందిన సంతోష్‌కుమార్‌సింగ్ గత సంవత్సరం క్రితం ఎస్‌విఐఇపిఎల్ కంపెనీ వారు 7వ దశ కర్మాగారంలో వెల్డింగ్ పనులు నిర్వహించేందుకు తీసుకొచ్చారు. రోజు మాదిరిగా సంతోష్‌కుమార్‌సింగ్ కర్మాగారంలోని టిజి బిల్డింగ్, డి ఎరేటర్ ఫ్లోర్‌లో వెల్డింగ్ పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై నుండి కింద పడటంతో సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.