క్రైమ్/లీగల్

అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలకు గురి చేసిన భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, మార్చి 19: అదనపుకట్నం కోసం ఓ మహిళను చిత్రహింసలు పెట్టడంతో పాటు శరీరం అంతా వాతలు పెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసుస్టేషన్ పరిధిలోని మోపిదేవి కాలనీకి చెందిన కర్లపూడి కిరణ్‌కు చిరువోలుకు చెందిన దోవారి జ్యోతితో 2012 ఏప్రిల్ 27న వివాహమైంది. ఆ సందర్భంగా రూ.35వేలు నగదు, ఉంగరం, నాలుగు సెంట్ల స్థలం కట్నంగా ఇచ్చారు. జ్యోతి తల్లిదండ్రుల తదనంతరం డాబా వారికి ఇచ్చేలా పత్రాలు వ్రాసి ఇచ్చారు. పెళ్లైన ఏడాదికే అదనపు కట్నం కావాలని, డాబా పత్రాలు ఇవ్వాలని భర్త కిరణ్ జ్యోతిని వేధించటం ప్రారంభించాడు. భర్త, అత్తమామల వేధింపులు భరించలేక జ్యోతి ఇటీవల ఆత్మహత్యయత్నానికి కూడా పాల్పడింది. అనంతరం పెద్దలు రాజీచేసి కాపురానికి పంపించారు. కాగా వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, అదేమని అడిగితే తనను తరచు కొడుతున్నాడని జ్యోతి తెలిపింది. అదనపుకట్నం కోసం డాబా అమ్మాలని అత్తమామలతో కూడా గొడవపడేవాడని చెప్పింది. ఈ నేపథ్యంలో ఈనెల 11వ తేదీ రాత్రి మోపిదేవి కాలనీలో జ్యోతి ఉండగా అర్ధరాత్రి సమయంలో భర్త కిరణ్, బావ మోపిదేవి సర్పంచ్ కర్లంపూడి పూర్ణచంద్రరావు, అత్తమామలు నాగమణి, నాగులు, ఆడపడుచు స్వప్న తనపై దాడి చేసి చిత్రహింసలకు గురి చేశారని చెప్పింది. భర్త కిరణ్ శరీరం కాల్చడం, చెప్పుతో కొట్టడం, తలను గోడకేసి బాదటం చేసేవాడని జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. ఈనెల 12న కిరణ్ భార్య జ్యోతితో పాటు ఇద్దరి పిల్లలను అత్తవారింటికి తీసుకువెళ్లి మీ అమ్మాయి మా పరువు తీస్తోంది. ఇక్కడే ఉంచుకోమని వదిలేసి వెళ్లాడు. తరువాత విషయం తెలుసుకున్న జ్యోతి తల్లి వెంకటేశ్వరమ్మ, తండ్రి ఆదిశేషులు మోపిదేవి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐ నాగేంద్రరావుకు ఫిర్యాదు చేశారు. అంతట ఎస్‌ఐ అత్తింటి వారిని పిలిచి మందలించారు. జ్యోతిని ప్రైవేటు వైద్యశాలకు చేర్చాలని జ్యోతి తల్లిదండ్రులకు ఎస్‌ఐ తెలిపారు. మరుసటి రోజున విపరీతమైన నొప్పులు, తలతిప్పటంతో ఈనెల 14న జ్యోతిని అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలలో చేర్చగా చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని భర్త, బావ బెదిరించటంతో బాధితురాలు ఎవ్వరికీ చెప్పుకోలేదు.