క్రైమ్/లీగల్

కౌలు రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరవకొండ, ఫిబ్రవరి 6 : పంటలు పండక చేసిన అప్పులు తీర్చలేక కౌలు రైతు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని పెద్దముష్టూరు గ్రామాంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు పెద్దముష్టూరుకు చెందిన కౌలు రైతు బోయ రాము(25) రెండు సంవత్సరాల నుంచి నాలుగెకరాల భూమిని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నాడు. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు పండక దాదాపు రూ.5లక్షల మేర అప్పులు చేసుకున్నాడు. ఈనేపథ్యంలో అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు రావడంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.