క్రైమ్/లీగల్

జోక్యం చేసుకోలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: విదేశాల్లో నివసించే భారతీయులకు ఉచితంగా న్యాయసేవలు అందించేలా ఓ విధానం రూపకల్పనకు ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిల్ బుధవారం హైకోర్టు ముందుకొచ్చింది.‘ విదేశాల్లో ఒక్కోదేశానికి ఒక్కోరకమైన చట్టం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మేం జోక్యం చేసుకోలేం’అని కోర్టు తేల్చిచెప్పింది.‘ దీనిపై ఓ విధానం రూపొందించమని మేం ఎలా ఆదేశిస్తాం. ఆయా దేశాల చట్టాలు, కోర్టుల్లో జోక్యం చేసుకోలేం’ అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్, జస్టిస్ వికే రావుతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఇలాంటి అంశాలపై ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడంపై బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సోలిసిటర్ జనరల్ మణీందర్ ఆచార్య వాదనలు వినిపించారు. విదేశాల్లోని ఎన్నారైలకు న్యాయసహాయం అందజేతకు సంబంధించి ఇప్పటికే ఓ విధానం ఉందని ఆయన కోర్టుకు తెలిపారు. ఏ పరిస్థితుల్లో న్యాయ సహాయం అందిస్తుంది, వాటి వివరాలును మాత్రం ఆయన వెల్లడించలేదు. వాదోపవాదలు విన్న తరువాత ప్రవాసీ లీగల్ సెల్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. అలాగే పిల్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు పిటిషనర్ తెలిపారు. విదేశాల్లో పనిచేస్తున్న నిపుణతలేని కార్మికులకు ఆయా దేశాల్లో చట్టాల గురించి తెలియడం లేదని, అందువల్ల కనీస హక్కులే పొందలేక పోతున్నారని పిటిషనర్ తరఫున న్యాయవాది జోసే అబ్రహాం కోర్టుకు తెలిపారు. మరి ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో భారతీయుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రే స్వయంగా విషయాన్ని పార్లమెంట్‌లో వెల్లడించారని పిటిషనర్ గుర్తుచేశారు. గల్ఫ్ దేశాల్లో 7,800 మంది జైళ్లలో మగ్గుతున్నారని, ఒక్క సౌదీలోనే రెండువేల మంది ఉన్నట్టు కేంద్రం తెలిపిన విషయాన్ని జోసే అబ్రహాం తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సరైన న్యాయసహాయం అందకే అండర్ ట్రయిల్ ఖైదీలుగానే కారాగారాల్లో మగ్గుతున్నట్టు బెంచ్‌కు తెలిపారు. రాజ్యాంగంలోని 39-ఏ ఆర్టికల్ కింద ప్రజలందరికీ న్యాయసహాయం అందాల్సి ఉందని వాదించారు.