క్రైమ్/లీగల్

పసిగుడ్డును అమ్మేసిన వైద్యురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 8: పురుడు చేసిన వైద్యురాలే తల్లి గర్భం నుండి వచ్చిన పసి కందును మరో కంట కనబడకుండా అమ్మేసిన సంఘటన మచిలీపట్నంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆలస్యంగాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బందరు మండలం సత్రంపాలెంకు చెందిన చిన్నం కనకదుర్గ పుట్టుకతోనే వికలాంగురాలు. నెలలు నిండిన కనకదుర్గ ఐదు రోజుల క్రితం స్థానిక జవ్వారుపేట సెంటరులోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో ప్రసవం నిమిత్తం వచ్చింది. ఆమెకు ఆపరేషన్ చేసిన ఆ నర్సింగ్ హోమ్ వైద్యురాలు మగ బిడ్డను గుట్టు చప్పుడు కాకుండా మాయం చేసింది. నీకు బిడ్డ పుట్టలేదు, నీ గర్భంలో గడ్డ ఉందని, దాన్ని తీసి పారేసానని తెలిపింది. వైద్యురాలి వాదన ఇలా ఉండగా అదే ఆస్పత్రి నర్సు మరో వాదన వినిపిస్తోంది. గర్భంతో వచ్చిన బాధితురాలి తల్లి ఆడ పిల్ల పుడితేనే తమకు ఇవ్వమని, మగ బిడ్డ అయితే మాకొద్దని చెప్పారని చెబుతోంది. పుట్టిన మగ బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తాము తెలిపామని, ఆ బిడ్డను తీసుకునేందుకు వారు ముందుకు రాలేదన్నారు. దీంతో మేమే ఆ బిడ్డను పిల్లల వైద్యుడికి చూపించగా అక్కడ మృతి చెందినట్లు తెలుపుతోంది. బాధితులు మాత్రం తమ బిడ్డను కావాలని మాయం చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించిన ఆర్‌పేట మహిళా పోలీసులు వైద్యురాలు, నర్సును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.