క్రైమ్/లీగల్

లాప్‌టాప్‌లు చోరీ చేస్తున్న ఐదుగురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, : హాస్టళ్లలోను, బాచిలర్స్ ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను మాదాపూర్, నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి రూ.25 లక్షల విలువ చేసే 19 లాప్‌టాప్‌లు, 43 సెల్‌ఫోన్లు, నాలుగు మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. ఏపీలోని గుంటూరు జిల్లా నర్సరావుపేట పెద్ద చెరువుకు చెందిన రియాజుద్దీన్ నగరంలో కారు డ్రైవర్‌గా పని చేస్తు జీవనం సాగిస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడిన రియాజ్ వచ్చే జీతం సరిపోక లాప్ టాప్‌లు సెల్ ఫోన్లు దొగించడం మొదలు పెట్టాడు. మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, నార్సింగ్‌తో పాటు కాజీపేటలోని పలు హాస్టల్స్‌లో ఉంటు రూమ్‌లో ఉన్నవారితోను పక్కన గదిలో ఉండే వారితో సన్నిహితంగా ఉంటూ సెల్ ఫోన్లులు, లాప్ టాప్‌లు దొంగిలించేవాడు. రియాజ్ సైబరాబాద్, ఖాజిపేట ఏపీలో 16 కేసుల్లో నిందితుడని డీసీపీ తెలిపారు. ఏపీతోపాటు తెలంగాణలో కూడా 14 పోలీస్‌స్టేషన్‌లలో 32 కేసుల్లో రియాజ్‌ని గతంలో పోలీసులు అరెస్టు చేసినట్లుని వివరించారు. మరో కేసులో మాదాపూర్ పోలీసులు.. కరుడుగట్టిన దగ్గుల నరేష్ (23) మహ్మద్ ఆసీఫ్ (23), మహ్మద్ ఇమ్రాన్ (20) మహ్మద్ ముకీం (23)ను అరెస్టు చేశారు. నిందితులు మాదాపూర్‌లోని హాస్టళ్లను లక్ష్యంగా చేసుకుని నేరాలకు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. నరేష్‌పై రెండు తెలుగు రాష్టల్రలో ఆరు పోలీసుస్టేషన్‌లో 18 వారెంట్లు ఉన్నాయిని, ఆసీఫ్‌పై ఎనిమిది కేసులు, ఇమ్రాన్‌పై 10 కేసులు ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలను, 18 సెల్‌ఫోన్లులు, రెండు లాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వెంకటేశ్వర రావు చెప్పారు. ఉభయ రాష్ట్రాల్లో పలు కేసులు ఉన్నందున వీరిపై పీడీ యాక్టుకు రికమండ్ చేయనున్నట్లు డీసీపీ తెలిపారు. కార్యక్రమంలో ఏడీసీపీ వెంకటేశ్వర్లు, మాదాపూర్ ఏసీపీ శ్యామ్ ప్రసాద్ రావు, మాదాపూర్ సీఐ నాగేశ్వరరావు, డీఐ ప్రకాష్ రెడ్డి, నార్సింగ్ సీఐ రామణ గౌడ్, డీఐలు లక్ష్మినారాయణ రెడ్డి పాల్గొన్నారు.