క్రైమ్/లీగల్

సైకో కిల్లర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మార్చి 20: ఆంధ్రా తమిళనాడు రాష్ట్రాల్లో కొద్ది సంవత్సరాలుగా వరుస హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడుతున్న సైకో కిల్లర్ మునుస్వామిని ఎట్టకేలకు చిత్తూరు పోలీసులు పట్టు కున్నారు. రెండు రాష్ట్రాల్లో శివారు ప్రాంతాల్లోని ఒంటరి మహిళలనే లక్ష్యంగా చేసుకొంటూ 1992 నుంచి ఎనిమిది హత్యలు, అనేక నేరాలకు పాల్పడ్డాడు. ఒంటరిగా ఉన్న మహిళల ఇళ్లకు వెళ్లి ఆకలిగా ఉందని కొంత అన్న పెట్టమని అడిగితే లేదని చెప్పిన చిన్నపాటి కారణాలతోనే పలు దారుణాలకు పాల్పడుతూ వచ్చాడు. రాత్రి వేళల్లో సుమారు 11 గంటల నుంచి ఒంటి గంట మధ్య సమయంలో శివారు ప్రాంతాల్లోని ఇళ్లల్లోని ఒంటరిగా ఉన్న మహళలను బండరాతితో తలపై కొట్టి చంపడం, అనంతరం మహిళలు, వృద్ధులను వివస్తన్రు చేసి, బండరాయిని బయట పడేసి వెళ్లడం. హత్య చేసిన మహిళలపై ఉన్న బంగారు నగులు కాని , ఇళ్ళల్లో ఉన్న నగలను దోచుకోక, కేవలం బీరువాలు ఇతర ప్రాంతాల్లో దాచి ఉంచిన కొద్దిపాటి నగదునే అపహరించడం మునుస్వామి నైజం. చిత్తూరు ఎస్పీ రాజశేఖర్ బాబు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా మాన్ తెంగాల్ గ్రామానికి చెందిన పంజాక్షి మునుస్వామి (42) అవివాహితుడు, 1992 సంవత్సరం నుంచి ఆంధ్రా తమిళనాడు రాష్ట్రాల్లో 36 కేసుల్లో నిందితుడు. చిన్నప్పటి నుంచే చిన్న చిన్న నేరాలు చేయడం, జైలుకు వెల్లడం తిరిగి బయటకు వచ్చిన తరువాత మళ్లీ ఇదే తరహాలో దారుణాలకు పాల్పడ్డడం ఇతనికి నిత్యకృత్యమైంది. తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 1992 నుంచి జరిగిన పలు హత్యలు చోరి కేసుల్లో పోలీసులకు పట్టుబడి, వివిధ ప్రాంతాల్లో ఏడేళ్లపాటు జైలు జీవితం అనుభవించాడు. 2017లో రెండేళ్ల బాలికను చంపి సెల్‌ఫోన్‌తోపాటు యాభై రూపాయలను దోచుకొన్న కేసులో మునుస్వామి నిందితుడు. అప్పటి నుంచి ఆంధ్రా సరిహద్దు ప్రాంతానికి వచ్చి ఇక్కడ పలు ప్రాంతాల్లో ఇటీవల వరుస హత్యలకు పాల్పడుతూ వస్తున్నాడు.