క్రైమ్/లీగల్

యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, ఫిబ్రవరి 9: వివాహితతో ప్రేమలో పడి తాగుడికి భానిస అయిన ఓ యువకుడు భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి కొండాపూర్ గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... పోలీసు స్టేషన్ పరిధి కొండాపూర్ గ్రామంలోని ఓ రైతు వ్యవసాయ క్షేత్రం వద్ద గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం మైదూర్ గ్రామానికి చెందిన వేముల కల్యాణ్(21) కాపలదారుడిగా పని చేస్తున్నాడు. ఇటీవల స్థానికంగా ఉన్న ఓ వివాహిత మహిళతో ప్రేమలో పడ్డట్లు తెలుసుకున్న అతని తండ్రి నాగేశ్వర్ రావు ఈ నెల ఏడున కొండాపూర్ చేరుకుని కొడుకు ప్రేమ వ్యవహారాన్ని తెలుసుకుని మందలించినట్లు చెప్పారు. దింతో మనస్థాపానికి గురైన కల్యాణ్ తాగుడుకు బానిసై పని మానేసి ఇంట్లోనే ఉంటున్నట్లు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం తాగిన మత్తులో పక్కనే నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్థుల భవనంపైకి ఎక్కి కిందకు దూకినట్లు తెలిపారు. దింతో తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో చికిత్స నిమిత్తం నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు, మృతదేహన్ని బంధువులకు అప్పగించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ రఘువీర్‌రెడ్డి తెలిపారు.