క్రైమ్/లీగల్

వృద్ధురాలి అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, ఫిబ్రవరి 9: ఇంట్లో చెప్పకుండా వెళ్లిన వృద్దురాలు అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వౌలాలి గాంధీనగర్‌లో నివసించే వి.సంగమ్మ(73) ఈనెల 8వ తేదిన మధ్యాహ్నం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లి ఇప్పటి వరకు తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు చుట్టు పక్కల, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.