క్రైమ్/లీగల్

ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 12మంది అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన్వాడ: మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలలో ఇంగ్లీష్ పేపర్-1 లీకేజీ వ్యవహరంలో 12మందిని ఆరెస్టు చేసినట్టు నారాయణపేట డీఎస్పీ శ్రీ్ధర్ తెలిపారు. మంగళవారం మరికల్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరికల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ పేపర్-1 ని మరికల్‌కు చెందిన నవీన్, ప్రవీణ్‌కుమార్‌లు వాట్సాప్‌లో పంపిం చారన్నారు. అదేవిధంగా మరికల్ మండల కేంద్రంలోని రెండు ప్రైవేట్ పాఠశాలలు ప్రతిభ హైస్కూల్, గౌతమి మోడల్ స్కూల్, ఆత్మకూర్‌కు చెందిన ప్రైవేట్ పాఠశాల ఎంవి రామన్ హైస్కూల్, దేవరకద్రలోమరో ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల నుండి ఫోన్ ద్వారా వాట్సాప్ చేసి పరీక్ష పేపర్‌ను లీక్ చేశారన్నారు. 10వ తరగతి పేపర్ లీకేజిలో దాదాపు 15మందిపైగా ఆదుపులోకి తీసుకుని వారిని విచారణ చేశామన్నారు. వీరిలో 12 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఈ పేపర్ లీకేజిలో పరీక్షల సెంటర్ వద్ద పనిచేస్తున్న పోలీసులపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో మరికల్ సీఐ శ్రీకాంత్‌రెడ్డి, మక్తల్ సీఐ వెంకట్, ధన్వాడ ఎస్సై శంషొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.