క్రైమ్/లీగల్

వయస్సు 25.. చైన్ స్నాచింగ్‌లు 25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 13: 2015లో విడుదలైన ఒక రోమాంటిక్ క్రైమ్ కథ చిత్రం గుర్తుంది కదా .. ఆ చిత్రంలో కధానాయకుడు పెద్ద బైకు, ముఖానికి రుమాలు, బైక్‌కు నెంబర్ ప్లేట్ లేకుండా ఒంటరి మహిళల మెడలో గొలుసులు లాక్కుని తన ప్రేయసికి ఇచ్చేవాడు.. ఆ సినిమా ప్రేరణతో సరిగ్గా అలాంటి కధే మన గుంటూరు అర్బన్ పోలీసులకు ఎదురైంది. ఇక్కడ కధలో హీరో అదేవిధంగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. కాకపోతే మనోడు పేకాట, కోళ్లపందాలు, జల్సా జీవితానికి వాటిని వాడుకుంటూ జల్సాలు చేస్తుంటాడు. ఈ ఘరానా గొలుసు దొంగ గోపిని అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వయస్సు 25 సంవత్సరాలు.. 9నెలల కాలంలో గుంటూరు అర్బన్ పోలీసు పరిధిలో 25 చైన్‌స్నాచింగ్‌లు చేశాడు. ఒకానొక దశలో మహిళలు బంగారు ఆభరణాలు ధరించి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి సృష్టించి, గుంటూరు అర్బన్ పోలీసులకు సవాల్‌గా నిలిచాడు. చదివింది 6వ తరగతి మాత్రమే.. కానీ నిత్యం సినిమాలు చూస్తూ వాటిల్లో ముఖ్యంగా గొలుసు దొంగతనాలు ఏ విధంగా చేస్తున్నారో అచ్చు దించినట్లు అదేవిధంగా చేస్తూ చివరకు కటకటాల వెనక్కి వెళ్లిన ఓ ఘరానా దొగ గోపి గురించి పై కధంతా.. వివరాల్లోకి వెళితే గుంటూరు అర్బన్ పోలీసు పరధిలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఘరనా దొంగను పోలీసులు అరెస్టుచేసి అతని వద్ద నుంచి రూ. 32లక్షల విలువైన కేజీ బంగారం స్వాధీనం చేసుకున్నారు. బుధవారం గుంటూరు అర్బన్ పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అర్బన్ ఎస్పీ సిహెచ్ విజయారావు నిందితుడి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ విజయారావు మాట్లాడుతూ జిల్లాలోని చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామానికి చెందిన పోతినేని గోపి తాఫీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పేకాట, మద్యం, కోడిపందాలకు అలావాటు పడి డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చడానికి చైన్‌స్నాచింగ్‌లను ఎంచుకున్నాడు. ఒంటరి మహిళలు, ఫంక్షన్లకు వెళ్లేవారు, దేవాలయాలకు వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకుని వారి మెడలోని బంగారు ఆభరణాలను తెంచుకుని ఉడాయించే వాడని ఎస్పీ తెలిపారు. మంగళవారం రాత్రి మంగళగిరి వద్ద పల్సర్ బైక్‌పై నెంబర్ ప్లేట్ లేకుండా వెళుతున్న వాహనాలను తనిఖీలు చేస్తుండగా నిందితుడు సినిమా స్టైల్‌లో పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అదుపులోకి తీసుకుని విచారించగా అతను గుంటూరు అర్బన్ పరిధిలో పాతగుంటూరు, లాలాపేట, కొత్తపేట, పట్ట్భాపురం, అరండల్‌పేట స్టేషన్ల పరిధిలో 22 చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడినట్లు గుంటూరు రూరల్ పోలీసు పరిధిలో 3 చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. నిందితుడు వద్ద నుంచి 31 లక్షల విలువైన కేజీ బంగారం, బైక్ స్వాధీనం చేసి కోర్టుకు హాజరుపర్చినట్లు తెలిపారు. ముద్దాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన మంగళగిరి సిఐ రవిబాబు, సీసీయస్ ఇన్‌స్పెక్టర్లు అబ్దుల్ కరీం, సురేష్‌బాబు సిబ్బందిలను రివార్డులకు సిఫారసు చేసినట్లు ఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు వైటి నాయుడు, లక్ష్మీనారాయణ, డిఎస్పీ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.