క్రైమ్/లీగల్

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, ఫిబ్రవరి 14: షాపు యజమాని టిన్ నెంబర్‌తో సరుకును తెప్పించి అమ్ముకున్న కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొత్తపేట పోలీసుల కథనం ప్రకారం రాజస్తాన్‌కి చెందిన భావేష్ (22) ఐదేళ్ల క్రితం విజయవాడకు వలస వచ్చాడు. అంతకు ముందే అతని అన్న విజయవాడ పాతబస్తీలోని ఎలక్ట్రికల్ షాపులో పని చేస్తుండగా భావేష్ కూడా మరో ఎలక్ట్రికల్ షాపులో గుమస్తాగా చేరాడు. రెండేళ్లుగా ఎంతో నమ్మకంగా పని చేసిన భావేష్‌ని షాపు యజమాని ఉయ్యూరులోని తన షాపులో బాధ్యతలు అప్పగించాడు. అయితే అక్రమ మార్గంలో సంపాదించాలనే ఆలోచనతో పెడదోవపట్టాడు. సామారంగం చౌక్‌లో హరియంత్ ఎలక్ట్రికల్స్ పేరున షాపును రెండు నెలల క్రితం ప్రారంభించాడు. అయితే తాను గతంలో పని చేసిన విష్ణు ఎలక్ట్రికల్స్ టిన్ నెంబర్‌తో రెండు హోల్‌సేల్ షాపుల నుండి రూ. 2.5 లక్షల సరుకును తెప్పించుకున్నాడు. తాను వెళ్లకుండా ఆటోను పంపించాడు. హోల్‌సెల్ వ్యాపారులు ఆడర్ నెంబర్ నమోదు చేసుకుని సరుకుని పంపించారు. అయితే విష్ణు ఎలక్ట్రికల్స్ యజమాని ఎంతకూ నగదు పంపించకపోవడంతో ఫోన్ చేయగా భావేష్ నిర్వాహకం బయటపడింది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు సోమవారం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు అప్పటికే రాజస్థాన్ పరారయ్యాడు. పోలీసులు నిందితుని అన్న అల్పేష్ కుమార్‌ని అదుపులోకి తీసుకోగా అతని ద్వారా భావేష్‌ని విజయవాడకి రప్పించారు. గురువారం ఉదయం అల్పేష్ తమ్మునికి ఫోన్ చేసి పోలీసు స్టేషన్‌కి వెళ్లాలని సిద్ధంగా ఉండమన్నాడు. భావేష్ కేబీఎన్ కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. తాను చేసిన తప్పుకు మార్కెట్లో తలదించుకోవాల్సి వస్తుందని తాను చనిపోతున్నానని స్నేహితునికి ఫోన్ చేసి చెప్పిన భావేష్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహితుని ద్వారా చేసుకున్న ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.