క్రైమ్/లీగల్

రివ్యూ పిటిషన్లు లోపభూయిష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: కొంతమంది న్యాయవాదులు లోపభూయిష్టమయిన పిటిషన్లు దాఖలు చేస్తూ మీడియాలో విస్తృత ప్రచారం కోసం ప్రయత్నిస్తున్నారని సుప్రీంకోర్టు శుక్రవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం రాఫెల్ కేసులో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలయిన రివ్యూ పిటిషన్‌లను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానం రిజిస్ట్రీలో పిటిషన్లు దాఖలు చేసినప్పుడు వాటిలోని లోపాలను తొలగించడానికి బదులు విస్త్రృత ప్రచారం కోసం మీడియా వద్దకు వెళ్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ‘అటువైపు వారు అమాయకులేమీ కాదు.. పిటిషనర్లు విస్తృత ప్రచారం కోసం మీడియా వద్దకు వెళ్తున్నారు’ అని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి, న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రాఫెల్ కేసులో తాను ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలయిన లోపభూయిష్ట రివ్యూ పిటిషన్లను ప్రస్తావిస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అత్యవసర లిస్టింగ్, విచారణ అవసరమయిన కేసులను ప్రస్తావించిన న్యాయవాదుల వాదనలు వింటున్న సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తావనకు వచ్చిన విచారణ ప్రక్రియపై వచ్చి, సాక్ష్యమివ్వాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ను ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు.
దీనివల్ల రిజిస్ట్రీ అధికారులు తమ చర్యలను సరిచేసుకోగలుగుతారని, మరింత సమర్థవంతంగా పని చేయగలుగుతారని పేర్కొన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందాన్ని సవాలు చేస్తూ దాఖలయిన కొన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు డిసెంబర్ 14న కొట్టివేసింది.