క్రైమ్/లీగల్

రోడ్డు పక్క దిమ్మెను ఢీకొన్న కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేశంపేట, ఫిబ్రవరి 16: రోడ్డు పక్కన ఉన్న దిమ్మెకు కారు ఢీకొన్న ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైపోయిందని కేశంపేట పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి కేశంపేట మండలం బోధునంపల్లి గ్రామ శివారులో రోడ్డు పక్కన ఉన్న దిమ్మెను ఢీకొనడంతో ఆడి కారు పూర్తిగా దగ్ధమైపోయింది. హైదరాబాద్‌కు చెందిన రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి షాద్‌నగర్ నుండ కేశంపేట మీదుగా డిండికి ఫంక్షన్‌కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కారులో ఒక్కరే ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కారులో నుంచి పొగలు వచ్చిన విషయాన్ని గమనించి రాజేశ్వర్ రెడ్డి ఒక్కసారిగా బయటకు దూకి ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నారు.