క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో వీఆర్వో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, ఫిబ్రవరి 18: డిజిటల్ ఈ-పాస్ పుస్తకం కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని ఒక రైతును డిమాండ్ చేసిన వీఆర్వో సోమవారం రాత్రి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మండలంలోని సిహెచ్ పోతేపల్లి ఇన్‌చార్జి వీఆర్వోగా పనిచేస్తున్న పి సుబ్రహ్మణ్యం ఒక రైతు కుమారుడు రాయపాటి లీలా కృష్ణమూర్తి నుండి నాలుగువేల రూపాయలు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులు పన్నిన వలకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ వీ గోపాలకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని దొరసానిపాడుకు చెందిన రైతు రాయపాటి నాగేశ్వరరావుకు సిహెచ్ పోతేపల్లిలో 4.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే ఈ భూమికి ప్రస్తుతం మాన్యువల్ పాస్ పుస్తకం ఉండగా దానిని డిజిటల్ ఈ పాస్ పుస్తకంగా మార్చాలని కొద్ది నెలల క్రితం రైతు నాగేశ్వరరరావు కుమారుడు లీలా కృష్ణమూర్తి మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. అయితే వీఆర్వో దానిని పరిశీలించకుండా తిరస్కరించాడు. ఈ క్రమంలో ఈ నెల 11న మరోసారి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తరువాత వీఆర్వోను కలిసి తమకు ఈ పాస్ పుస్తకం ఇప్పించాలని కోరాడు. ఇలా ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఈ పాస్ పుస్తకాలు రావని, ఇక్కడొక రేటుంటుందని, అది చెల్లిస్తేనే పనులు అవుతాయని వీఆర్వో చెప్పాడు. ఈ క్రమంలోనే నాలుగువేల రూపాయలు ఇస్తే పాస్ పుస్తకం ఇస్తానని వీఆర్వో సుబ్రహ్మణ్యం తెలిపాడు. దీంతో లీలా కృష్ణమూర్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీనిపై ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ పథకం ప్రకారం వలపన్ని స్థానిక తహసీల్దారు కార్యాలయంలోని కంప్యూటరు గదిలో రైతు కుమారుని నుండి నాలుగు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా వీఆర్వో సుబ్రహ్మణ్యంను పట్టుకున్నారు. అనంతరం ఈ విషయాన్ని తహసీల్దారు ఎం కృష్ణమూర్తికి తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని, వీఆర్వోను ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ కె శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.