క్రైమ్/లీగల్

మహిళ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరబల్లి, మార్చి 22: మండల పరిధిలోని వంగిమళ్ల గ్రామ పంచాయతీలోని కావలిగడ్డకు చెందిన నందిని(25) భర్త, అత్తింటి వారి వేధింపులు తాళలేక బుధవారం రాత్రి సూపర్ వాస్మోల్ తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. వివరాల్లోకెళ్తే..... మండల పరిధిలోని వీరబల్లి గ్రామ పంచాయతీలోని బాలసానివాండ్లపల్లెకు చెందిన రెడ్డయ్య కుమార్తె నందిని కావలిగడ్డకు చెందిన మల్లిఖార్జునకు గత ఏడు సంవత్సరాల క్రితం వివాహం చేసినట్లు తెలిపారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారన్నారు. జీవనోపాధి కొరకు నందిని, మల్లిఖార్జున దంపతులు ఇరువురూ గల్ఫ్ దేశాలకువెళ్లి ఇటీవల తిరిగి స్వగ్రామానికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఇంతలో భర్త మల్లిఖార్జున, అత్తమామలు వేధింపులు తాళలేక గత మూడు రోజుల క్రితం బాలసానివాండ్లపల్లెకు అమ్మగారింటికి వచ్చినట్లు తెలిపారు. తల్లిదండ్రుల స్వగృహంలోనే బుధవారం రాత్రి విషం సేవించి మృతిచెందినట్లు తెలిపారు. నందిని తండ్రి చెన్నూరు రెడ్డయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి మృతదేహన్ని పోస్టుమార్టం కొరకు రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు స్థానిక ఎస్ ఐ లక్ష్మిప్రసాద్‌రెడ్డి తెలిపారు. కేసు పూర్వోపరాలు దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు.