క్రైమ్/లీగల్

జయరాం హత్య కేసులో దర్యాప్తు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో దర్యాప్తును జూబ్లీహిల్స్ పోలీసులు వేగవంతం చేశారు. ఘటనకు సంబంధించి వాస్తవాలు రాబట్టేందుకు సీన్ మొత్తాన్ని పునఃపరిశీలన చేయాలన్న ఉద్దేశంతో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డిని కృష్ణాజిల్లా నందిగామకు తీసుకెళ్లి విచారణ చేపట్టారు. విచారణలో రాకేష్‌రెడ్డి పొంతనలేని సమాధాలు చెబుతుండడం పోలీసుల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జయరాం హత్య కేసులో అసలేం జరిగిందని కూపీలాగే పనిలో హైదరాబాద్ పోలీసులున్నారు. కేసును పూర్తిస్థాయిలో తిరగదోడడానికి పోలీసులు సిద్ధమయ్యారు. మంగళవారం రాకేష్‌రెడ్డిని కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని నందిగామ వద్ద ఐతవరానికి తీసుకెళ్లారు. కారులో శవాన్ని ఉంచి విజయవాడకు వెళ్లిన తర్వాత ఓ బార్‌లో మద్యం కొనుగోలు చేశాడు. ఆ సమయంలో బార్ సప్లయర్స్‌తో రాకేష్‌రెడ్డి మాట్లాడిన వ్యక్తులతో సమాచారం సేకరించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఏ మార్గంలో చేరుకున్నారు? మార్గమధ్యలో రాకేష్‌రెడ్డి ఎవరెవరితో ఫోన్‌లో మాట్లాడాడు అన్న విషయాలపై దృష్టిపెట్టారు. హత్యకు గురయిన జయరాంపై మద్యం పోసి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు రాకేష్‌రెడ్డి తప్పించుకునేందుకు పథకం అమలు చేశాడు. విచారణలో రాకేష్‌రెడ్డి చెప్పిన అంశాలను పోలీసులు మరోసారి ధృవీకరించుకున్నారు. కాగా కారును వదివేసిన ప్రాంతానికి జయరాం మేనకోడలు శిఖాచౌదరిని పిలిపించుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన పోలీసులకు శిఖా చౌదరి చెప్పిన విషయాలను మరోసారి పోలీసులు పరిశీలిస్తున్నారు. రాకేష్‌రెడ్డికి సహకరించిన శ్రీనివాస్‌ను పో లీసులు విచారిస్తున్నారు. అలాగే సినీ నటుడు సూర్యప్రసాద్ పాత్రపై ఆరా తీస్తున్నారు. అతడ్ని విచారించారు. జయరాం శవాన్ని ఏపీకి తరలించడం లో రాజకీయ ప్రమేయం ఉందా? అన్న కోణంలో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. జయరాం శవాన్ని తరలించే సమయంలో ఎవరెవరికి రాకేష్‌రెడ్డి పోన్ చేశాడన్న అంశాలు కీలకం కానున్నాయి. జనవరి 31 న జయరాంను హత్య చేసినట్లు రాకేష్‌రెడ్డి పోలీసులకు వాం గ్మూలం ఇచ్చాడు. ఈకేసులో సంబంధం ఉందన్న అభియోగంతో ఎస్‌ఆర్ నగర్‌కు చెందిన రౌడీ షీటర్ నగశ్‌ను అరెస్టు చేశారు. హత్య తర్వాత జయరాం శవాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో పాలుపోక హైదరాబాద్‌లో తిరిగానని పోలీసులకు వివరించాడు.