క్రైమ్/లీగల్

మావోయిస్టు లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ క్రైం, ఫిబ్రవరి 22: నిషేధిత మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు ఇరెల్లి నాగరాజు ఆలియాస్ శివ శుక్రవారం వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ ఎదుట లొంగిపోయాడు. ఈ లొంగుబాటుకు సంబంధించి సిపి వెల్లడిస్తూ జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం, తీగారం గ్రామానికి చెందిన ఇరెల్లి నాగరాజు పదవ తరగతి వరకు చదువుకుని స్వగ్రామంలో మోటర్స్ మెకానిక్‌గా పనిచేసేవాడు. నాగరాజుకు అదే గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ సానుభూతి పరుడు కడారి యాదగిరితో పరిచయం ఏర్పడింది. యాదగిరి నాగరాజును మావోయిస్టు పార్టీలో చేర్పించేందుకు ప్రోత్సహించాడు. అంతేకాకుండా యాదగిరి తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ మిలిటరీ ఇన్‌చార్జి బడే చొక్కారావు ఆలియాస్ దామోదర్‌తో ఉన్న పరిచయం ద్వారా నాగరాజును గత సంవత్సరం జనవరి మాసంలో మావోయిస్టు పార్టీలో దళసభ్యుడుగా చేర్పించాడు. పార్టీలో 14 నెలలపాటు పనిచేసిన నాగరాజు దళసభ్యుడుగా తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శి యాపనారాయణ ఆలియాస్ హరిభూషన్, మిలిటరీ ఇన్‌చార్జ్ దామోదర్‌ల వద్ద పనిచేసాడు. గత కొద్దిరోజులుగా నాగరాజుకు మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక పోవడం, ఆరోగ్యం సహకరించకపోవడంతో నాగరాజు ఆ పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలవడం జరిగిందని పోలీసు కమిషనర్ తెలిపారు.