క్రైమ్/లీగల్

కమిషనరేట్‌లో ముగిసిన ‘మొబిలైజేషన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 22: విధి నిర్వహణలో పోలీసు అధికారులు, సిబ్బంది వృత్తి నైపుణ్యం మెరుగు పర్చుకునే ప్రక్రియలో భాగంగా కమిషనరేట్‌లో ప్రారంభమైన ‘మొబిలైజేషన్’ కార్యక్రమం శుక్రవారం సిటీ ఆర్మ్‌డ్ రిజర్వు మైదానంలో కవాతుతో ముగిసింది. ఈ ప్రక్రియలో రెండు బ్యాచ్‌లుగా మొత్తం 801 మంది రిజర్వు సిబ్బందికి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వృత్తి నైపుణ్యం మెరుగు పట్ల వివిధ అంశాలకు సంబంధించి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు సాయుధ ఆర్మ్‌డ్ రిజర్వు దళాలు నిర్వహించిన పరేడ్‌ను తిలకించి గౌరవవందనం స్వీకరించారు. సిబ్బంది నిర్వహించిన కవాతు ప్రదర్శనలో క్రమశిక్షణ, అంకితభావాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 20, 30 ఏళ్ళ క్రితం ఒక ప్రాంతంలో తీవ్రవాదం, నక్సలిజం, అదేవిధంగా రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఫ్యాక్షన్, శాంతి భద్రతల సమస్యలు ఉండేవన్నారు. అందువల్ల మొబిలైజేషన్ ప్రక్రియ జరిగేది కాదని, కేవలం ప్రధాన కార్యాలయం నుంచి తేదీలను మాత్రమే సమాచారం ఇచ్చేవారని అన్నారు. ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉందని, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆర్మ్స్, స్క్వాడ్ డ్రిల్‌తోపాటు యోగాపై కూడా శిక్షణ కూడా ఉంటుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు కూడా చర్చించినట్లు తెలిపారు. ఇటీవల పోలీసుశాఖలో లభించిన పదోన్నతులకు సంబంధించి సివిల్ విభాగం మాదిరిగానే ఏఆర్ ఏపిఎస్‌పి సిబ్బందికి కూడా సీనియారిటీ ప్రకారం త్వరలో ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. 15రోజులపాటు జరిగే మోబిలైజేషన్ ప్రక్రియ ద్వారా సిబ్బంది అందరూ ఒకేచోట కలుసుకోవడం పండుగ వాతావరణాన్ని తలపిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు బి రాజకుమారి, వెంకట అప్పలనాయుడు, కోటేశ్వరరావు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, సిఐలు, ఏఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

ఏపీ ద్రోహి బీజేపీని నిలదీయాలి
లబ్బీపేట, ఫిబ్రవరి 22: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామిలను అమలు చేయకుండా ద్రోహం చేసిన బీజేపీని నిలదీయాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. మార్చి 2న నగరంలో కౌలురైతుల సమస్యలపై రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని పార్టీల నేతలు తెలిపారు. మార్చి 1న మోడీ విశాఖ రాక సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ప్రదర్శనలు నిర్వహిస్తామని ఉభయ కమ్యూనిస్ట్‌పార్టీలు హెచ్చరించాయ. బందరురోడ్డులోని ఎంబివికె కేంద్రంలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేసిన బీజేపీని ప్రజలు నిలదీయాలని కోరారు. గిరిజనుల హక్కులను కాలరాస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో అప్పీలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల ఖర్చుల నిమిత్తం ఇచ్చే పెట్టుబడి సాయం, రైతులతో పాటు వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు ఇవ్వాలని, రైతులతో సమానంగా మొదటి దఫాలోనే చెల్లించాలని కుటుంబానికి 25 వేల రుపాయలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌలురైతుల పట్ల వివక్ష పాటించి అన్యాయం చేయటం సరైందికాదని విమర్శించారు. అలాగే 25 తరువాత వామపక్ష పార్టీల అభ్యర్ధుల పేర్లు ప్రకటిస్తామని, వచ్చే ఎన్నికల్లో 175 నియోజక వర్గాల్లో పోటీచేస్తామని పేర్కొన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళా అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఇప్పడు ప్రజలు గుర్తుకు వస్తున్నారని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సమయంలో మాట్లాడని ప్రభుత్వం ఇప్పడు రైతుల ఖాతాల్లో డబ్బు జమచేయటం విడ్డూరంగా ఉందన్నారు. ఎపికి ఎంత ఇచ్చారో కేంద్రం శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను పక్కదారి పట్టించేందుకే మోడీ విశాఖ వస్తున్నారని, అటవీ హక్కులను కాలరాస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. జనసేన, సిపిఎం, సిపిఐ కూటమిని విచ్చిన్నం చేసేందుకు టిడిపి, వైసిపి కుట్రలు చేస్తున్నాయని, వాటిని అధిగమించి ముందుకువెళ్తామని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, జెల్లి విల్సన్ పాల్గొన్నారు.