క్రైమ్/లీగల్

రోడ్డుప్రమాదంలో ఇద్దరు శివస్వాములు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దదోర్నాల, ఫిబ్రవరి 9: రోడ్డుప్రమాదంలో ఇద్దరు శివస్వాములు మృతిచెందిన సంఘటన మండలంలోని రోళ్ళపెంట వద్ద శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వికారాబాద్ జిల్లా గూడెంపల్లి గ్రామానికి చెందిన ఎదురుశెట్టి చంద్రప్ప (22), తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సిరిగం మధు (18) ప్రమాదంలో మృతి చెందారు. వీరు శివమాల ధరించి 41 రోజులపాటు నియమ నిష్టలతో పూజలు చేసుకొని గత రెండురోజుల కిందట మోటారుసైకిల్‌పై శ్రీశైలంకు బయలుదేరారు. కాగా, గురువారం శ్రీశైలంలో ఇరుముడిని స్వామివారికి సమర్పించి శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జుస్వామివార్లను దర్శించుకున్నారు. అక్కడినుండి మోటారుసైకిల్‌పై మహానందికి శుక్రవారం ఉదయం బయలుదేరారు. పెద్దదోర్నాల మండలంలోని రోళ్ళపెంట గ్రామ సమీపంలో మూలమలుపు వద్ద ఆత్మకూరు నుంచి హెచ్‌పి గ్యాస్ సిలిండర్లను తీసుకొని విజయవాడ వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో చంద్రప్ప, మధు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎస్సై రామకోటయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.