క్రైమ్/లీగల్

కట్టమైసమ్మ బస్తీలో ఇరు వర్గాల వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఫిబ్రవరి 23: గాజులరామారం డివిజన్ దేవెందర్‌నగర్, కట్టమైసమ్మ బస్తీలో ఇరు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకున్న సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే... కట్టమైసమ్మ బస్తీలోని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఓ గది, రెండు బేస్‌మెట్‌లను రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. అధికారులకు ఫిర్యాదు చేసిన వ్యక్తుల పై స్థానికులు వివాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు ఒకరి పై మరొకరు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా పదిమంది పై కేసునమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించాలి
కాచిగూడ, ఫిబ్రవరి 23: విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి వారిని ఆయా రంగాల్లో ప్రోత్సహించాలని రిటైర్డ్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ శ్రీనివాస్ అన్నారు. ‘సంస్కృతి’ డీజీ ప్లే స్కూల్ వార్షికోత్సవ వేడుకలు శనివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులను మార్కుల కోసం ఒత్తిడి తీసుకు రావద్దని సూచించారు. 30 మంది విద్యార్థులతో స్థాపించిన స్కూల్ నేడు వెయ్యి మంది విద్యార్థులతో నగరంలోని 20 స్కూళ్లు దిగ్విజయంగా నడుస్తున్నాయని తెలిపారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు గిరిధర్, హరిత, అనురాధ, కరుణ పాల్గొన్నారు.