క్రైమ్/లీగల్

నీటిగుంటలో మునిగి ముగ్గురు చిన్నారుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఫిబ్రవరి 24: బతుకుదెరువు నిమిత్తం పిల్లాపాపలతో వలస వచ్చిన కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన సంఘటన జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పరిధిలోని హనుమాన్‌నగర్‌లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన ముగ్గురు బాలురు నీటి గుంతలో పడి విగత జీవులయ్యారు. సంగారెడ్డి రూరల్ సీఐ శివకుమార్ కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మహారాష్టల్రోని నాందేడ్ జిల్లా నార్సి మండలానికి చెందిన కొన్ని కుటుంబాలు 14 సంవత్సరాల క్రితం వలస వచ్చి హనుమాన్‌నగర్‌లో స్థిరపడ్డాయి. ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నివృత్ కాంబ్లీ (12), సూర్యవంశీకృష్ణ (9), సందేష్ సుబాష్ (9)లు కాలకృత్యాలు తీర్చుకోవడానికి గ్రామ పొలిమెరల్లో జేసీబీలతో తవ్విన గుంతల్లో నిండిన నీటి మడుగు ప్రాంతానికి వెళ్లారు. గుంతలు లోతుగా ఉండటం, పిల్లలకు ఈత రాకపోవడంతో ముగ్గురు నీట మునిగి మృతి చెందారు. అక్రమంగా మట్టి తవ్వకాల కోసం వందల పీట్లలోతులో గుంతలు తవ్వడం వల్లనే ఈ దుర్ఘటనకు కారణమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేసారు. ఏలాంటి అనుమతులు లేకుండా గుంతలు తవ్విన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అప్పటి వరకు శవాలను తరలించమని స్థానికులు కాసేపు మొండికేసారు. గుంతలను ఎందుకు తవ్వారో, అందుకు కారకులు ఎవరో విచారణ చేస్తామని సీఐ శివకుమార్ స్థానికులకు నచ్చజెప్పి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో బాలురు కాలకృత్యాలకు వెళ్లినట్లు తెలుస్తోందని, కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని సీఐ వివరించారు.