క్రైమ్/లీగల్

ప్రేమ జంటపై దాడి యువతి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామవరపుకోట/్భమడోలు, ఫిబ్రవరి 24: పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో ప్రసిద్ధిచెందిన గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద ఆదివారం సాయంత్రం దారుణ ఘటన వెలుగుచూసింది. బౌద్ధారామాలను తిలకించడానికి వచ్చిన ప్రేమికులుగా భావిస్తున్న జంటలో యువతి దారుణ హత్యకు గురికాగా, యువకుడు తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం భీమడోలు మండలానికి చెందిన నవీన్ (19), శ్రీ్ధరణి (18) సహా మరో రెండు జంటలు ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో బౌద్ధారామాలు చూడటానికి వచ్చారు. కొద్దిసేపటికి మిగిలిన రెండు జంటలు కిందకు వచ్చేయగా, నవీన్, శ్రీ్ధరణి రాలేదు. దీనితో అనుమానించిన ఆరామాల నిర్వహణను పర్యవేక్షించే పురావస్తుశాఖ సిబ్బంది గాలించగా, ఒకచోట పొదల్లో శ్రీ్ధరణి మృతిచెంది, నవీన్ తీవ్రగాయాలతో పడివుండటాన్ని గమనించారు. వెంటనే వారు తడికలపూడి పోలీసులకు సమాచారం అందించారు. చింతలపూడి సీఐ యుజె విల్సన్, తడికలపూడి ఎస్సై కె సతీష్‌కుమార్ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న నవీన్‌ను చికిత్సకై ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే శ్రీ్ధరణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదుచేసి, దర్యాప్తుచేస్తున్నామని సీఐ విల్సన్ తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న నవీన్ కోలుకుంటే ఏం జరిగిందనే వివరాలు తెలుస్తాయన్నారు. యువతిపై అత్యాచారం జరిగిందా అనే విషయం పోస్టుమార్టం అనంతరం మాత్రమే తెలుస్తుందన్నారు.
అత్యాచారం... హత్య?
కాగా నవీన్, శ్రీ్ధరణి ప్రేమ జంట అని, గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు వారిపై దాడిచేశారని నవీన్ స్వగ్రామంలో వినవస్తోంది. భీమడోలు పంచాయతీ పరిధిలోని అర్జావారిగూడెంకు చెందిన దవులూరి నవీన్ భీమడోలులోని ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇదే మండలంలోని ఎఎంపురం గ్రామానికి చెందిన టి శ్రీ్ధరణి అదే కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరిద్దరికీ ఇంటర్ నుండి పరిచయంవుంది. ఆదివారం కళాశాలలో ప్రైవేటు తరగతులు ఉన్నాయని శ్రీ్ధరణి ఇంటి వద్ద నుండి బయలుదేరింది. స్నేహితులను కలిసి వస్తానంటూ నవీన్ బైక్‌పై ఇంటి నుండి బయలుదేరాడు. వీరిరువురు కలిసి బైక్‌పై కామవరపుకోట మండలంలోని జీలకర్రగూడెం బౌద్ధ ఆరామాల వద్దకు వెళ్లివుంటారని భావిస్తున్నారు. అక్కడ ఒంటరిగా కూర్చునివున్నపుడు గుర్తుతెలియని వ్యక్తులు నవీన్‌ను తీవ్రంగా కొట్టి, శ్రీ్ధరణిపై అత్యాచారం జరిపి, హత్యచేసి ఉండవచ్చని భావిస్తున్నారు. శ్రీ్ధరణి దుస్తులు చిరిగి, చెల్లాచెదురై ఉండటం, మృతదేహం పడివున్న ప్రాంతంలో పెనుగులాట జరిగినట్టు ఆనవాళ్లు ఉండటం గమనార్హం.