క్రైమ్/లీగల్

124కు పెరిగిన మృతుల సంఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, ఫిబ్రవరి 24: అస్సాంలో కల్తీ మద్యం తాగిన విషాద సంఘటనలో మృతుల సంఖ్య 124కు పెరిగింది. మరో 331 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు ఆదివారం తెలిపారు. జోర్హాట్ వైద్య కళాశాల ఆసుపత్రి (జేఎంసీహెచ్)లో 71 మంది మృతి చెందగా, మరో 272 మంది చికిత్స పొందుతున్నారని ఆరోగ్య శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు. జోర్హాట్ జిల్లాలోని టిటబోర్ సబ్ డివిజన్ హాస్పిటల్‌లో మరో నలుగురు మృతి చెందారని ఆయన చెప్పారు. గోలఘాట్ జిల్లాలో మృతుల సంఖ్య 49కి పెరిగింది. మరో 59 మంది ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆ అధికారి వివరించారు. కల్తీ మద్యం సేవించిన కొంత మంది ఇళ్లలోనే మృతి చెందారని, వారి వివరాలు ఇంకా అధికారులకు అందలేదని చెప్పారు. గోలఘాట్, జోర్హాట్ జిల్లాల్లోని రెండు తేయాకు తోటల్లో పనిచేస్తున్న చాలా మంది కార్మికులు గురువారం రాత్రి కల్తీ మద్యం సేవించి అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 12 మంది అదే రోజు రాత్రి మృతి చెందారు. అప్పటి నుంచి మృతుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. అస్సాంలోని బీజేపీ ప్రభుత్వ ఉదాసీనత, అసమర్థత వల్లే కల్తీ మద్యం విషాద ఘటన జరిగి, 120 మందికి పైగా మృతి చెందారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ‘అస్సాం ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకానితనం వల్లే కల్తీ మద్యం విషాద ఘటన చోటు చేసుకొని, 120 మందికి పైగా కార్మికులు మృతి చెందారు. అనేక మంది ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు’ అని రాహుల్ గాంధీ ఆదివారం సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని తాను ప్రార్థిస్తున్నట్టు రాహుల్ తెలిపారు.