క్రైమ్/లీగల్

కల్తీ ద్రావకం తాగి ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక (విశాఖ), ఫిబ్రవరి 24: నాటు సారాయి అనుకుని గుర్తు తెలియని రసాయనం (కెమికల్) తాగి ముగ్గురు మృతి చెందారు. మరో 12 మంది అస్వస్థతకు గురై విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న సంఘటన విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం స్వతంత్రనగర్ సమీపంలో గల ఎస్టీకాలనీలో ఆదివారం చోటుచేసుకుంది.
మృతి చెందిన ముగ్గురులో ఓ మహిళ ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12 మందిలో ముగ్గురు మహిళలతోపాటు యువకులు, వృద్ధులు ఉన్నారు. వీరంతా చెత్త కుప్పల్లో కాగితాలు ఏరుకుని వాటిని విక్రయించి జీవనం సాగిస్తారు. వీటితోపాటు పందులు పెంపకం వీరు జీవన వృత్తి. వాడపల్లి అక్కమ్మ(45) అనే మహిళ నివాసం ఉంటున్న ఎస్టీకాలనీకి సమీపంలో జివిఎంసి డింపింగ్ యార్డ్‌కు చిత్తుకాగితాలు, ప్లాస్టిక్ వేస్ట్‌ను ఏరుకునేందుకు శనివారం వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అక్కమ్మకు 10 లీటర్ల బ్లాక్ డబ్బాతో వారు సారాయిగా భావిస్తున్న గుర్తు తెలియని కెమికల్ దొరికింది.
డబ్బా కప్పు విప్పి చూసే సరికి నీళ్లు మాదిరిగా కనిపించడంతో నాటు సారాయి అనుకుని ఇంటికి తీసుకువచ్చారు. అనంతరం శనివారం రాత్రి ఆమెతో పాటు మరికొంతమంది నాటు సారాయిగా భావించిన కెమికల్‌ను సేవించినట్లు ఏసిపి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. శనివారం రాత్రి కెమికల్ సేవించిన పెండ్రి అప్పయ్యమ్మ (55) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అప్పయ్యమ్మ కెమికల్ తాగిన దగ్గర నుండి కడుపులో మంట, విరోచనాలు పట్టుకున్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు. అనంతరం ఆదివారం తెల్లవారుజామున మృతి చెందగా అనారోగ్యంతో మృతి చెందినట్లు భావించి కుటుంబీకులు ఆమెను ఖననం చేశారు. అనంతరం మరికొంత మంది ఆదివారం తెల్లవారు జామున నాటు సారాయిగా భావించిన కెమికల్‌ను తాగారు. ఈ తరుణంలో వారంతా అస్వస్థతకు గురయ్యారు. కెమికల్ తాగి అస్వస్థతకు గురైన వారిని స్థానికులు వెంటనే గాజువాకలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మరికొంతమందిని విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. తరలించిన వారిలో ఆసనాల కొండడు (55), వాడపల్లి అప్పడు (70) మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య ముగ్గురుకు చేరింది. వీరిలో వెంకమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్య అధికారులు చెబుతున్నారు.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కెజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ భాస్కర్ పరామర్శించారు. ఆయనతోపాటు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు, ఎక్సైజ్ అధికారులు పరామర్శించారు. అలాగే స్వతంత్రనగర్ ఎస్టీకాలనీలో గల మృతుల, క్షతగాత్రుల కుటుంబాలను గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, వైకాపా గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి పరామర్శించారు.