క్రైమ్/లీగల్

రాజ్‌భవన్ రోడ్‌లో కారు బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఫిబ్రవరి 24: రాజ్‌భవన్ రోడ్‌లో ఆదివారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వచ్చిన కారు నర్సింగ్ కాలేజీ మలుపు వద్ద ఖైరతాబాద్ వైపు నుంచి వస్తున్న డీసీఎంను ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన డీసీఎం రోడ్డుకు మధ్యలో ఏర్పాటు చేసిన ఫౌంటెన్లను ధ్వంసం చేసుకుంటూ కొంత దూరం ప్రయాణించి ఆగిపోయింది. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫలక్‌నుమాకు చెందిన సయ్యద్ అహ్మద్ డీసీఎం డ్రైవర్ ఖైరతాబాద్ వైపు నుంచి ప్రయాణిస్తూ నర్సింగ్ కాలేజీ సిగ్నల్ వద్దకు రాగానే రాజ్‌భవన్ స్కూల్ వైపు నుంచి వచ్చిన కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా కుదుపునకు గురైన డీసీఎం అదుపుతప్పి కుడివైపు ఉన్న ఫౌంటెన్లపైకి ఎక్కి ఆగిపోయింది. ప్రమాదానికి కారణమైన కారు కుడివైపు ఉన్న డివైడర్ ఎక్కింది. ప్రమాద స్థలంలోనే కారు వదిలివేసి కారులో ప్రయాణిస్తున్న వారు అక్కడి నుంచి పారిపోయారు. ఈ సంఘటనతో షాక్‌కు గురైన డీసీఎం డ్రైవర్ కొద్దిసేపటి అనంతరం తేరుకొని ఈ విషయంపై పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రోడ్డుపై ఎలాంటి అంతరాయం లేకుండా టోయింగ్ యంత్రం సహాయంతో వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డీసీ ఎం డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
కొందుర్గు, ఫిబ్రవరి 24: అక్రమంగా గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. శనివారం రాత్రి కొందుర్గులోని ఓ దుకాణంలో అక్రమంగా గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న ఎండీ మునావర్‌ను ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. అతని నుండి ఒక లక్ష ఎనిమిదివేల 550 రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు కొందుర్గు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.
అక్రమ రియల్ దందా