క్రైమ్/లీగల్

పిచ్చికుక్క దాడి ముగ్గురు చిన్నారులకు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఫిబ్రవరి 24: ఆదివారం కీసరలో పిచ్చికుక్క ముగ్గురు చిన్నారులపై దాడి చేసి గాయ పర్చింది. శివాజీనగర్ కాలనీలో ఆదివారం మధ్యాహ్నం చిన్నారులు ఆరు బయట ఆడుకుటుండగా పిచ్చికుక్క చిన్నారులు నిత్య, వైష్ణవి, వేణుల చెయ్యి, నడుము, కాలిపై దాడిచేసి గాయ పర్చింది. వెంటనే అక్కడ ఉన్న కాలనీ వాసులు కుక్కను చంపే ప్రయత్నం చేయగా పారిపోయింది. చిన్నారులను వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స అందించారు. కొన్ని నెలలుగా వీధుల్లో కుక్కలు విచ్చల విడిగా తిరుగుతున్నాయని, చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోంతోందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు