క్రైమ్/లీగల్

రథయాత్రకు అనుమతి నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: హైదరాబాద్‌లో బాసర నుంచి సికింద్రాబాద్ తాడ్‌బాన్ హనుమాన్ దేవాలయం వరకు శ్రీ రామ రథయాత్ర నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. వీహెచ్‌పీ కార్యదర్శి ఎం. గాల్‌రె డ్డి పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టి స్ ఎం. సీతారామమూర్తి విచారించారు. ఈ నెల 18న ఉగాది రోజు ప్రారంభించి 31వ తేదీ వరకు తాడ్‌బాన్ దేవాలయం వరకు రథ యాత్ర చేపట్టాలని ప్రతిపాదించామని పిటిషనర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమ రథయాత్రకు అనుమతి ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎస్. శరత్ కుమార్ వాదనలువినిపించారు. మైనార్టీల్లో అభద్రత భావన నెలకొల్పేందుకు ఈ యాత్రను ప్రతిపాదించారని చెప్పారు. ఈ యాత్ర వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని, అనేక మంది పారిశ్రామికవేత్తలు అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని కోర్టుకు తెలిపారు. అనంతరం కోర్టు వీహెచ్‌పీ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.