క్రైమ్/లీగల్

ఏడుకు చేరిన ‘ద్రావకం’ మృతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక, ఫిబ్రవరి 25: నాటు సారా అనుకుని రసాయన ద్రావకాన్ని తాగి మృతి చెందిన వారి సంఖ్య సోమవారానికి ఏడుకి చేరింది. మరో 8 మంది ప్రస్తుతం విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వారి వారి కుటుంబీకులు చెబుతున్నారు. విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం స్వతంత్రనగర్ సమీపంలో గల ఎస్టీ కాలనీకి చెందిన సుమారు 15 మంది వరకు నాటు సారా అనుకుని రసాయన ద్రావకాన్ని శనివారం రాత్రి కొంతమంది, ఆదివారం మరికొంత మంది తాగారు. శనివారం రాత్రి ఈ ద్రావకాన్ని తాగిన వారిలో ఆదివారం తెల్లవారు జామున పెండ్రి అప్పలమ్మ (55), ఆసనాల కొండడు (55), వాడపల్లి అప్పడు (70) మృతిచెందారు. ద్రావకం తాగి అస్వస్థతకు గురైన మరో 12 మందిని చికిత్స నిమిత్తం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఆసనాల రమణమ్మ (55) ఆసనాల చిన్నారావు (58), ఆసనాల రమణమ్మ (49), వాడపల్లి అంకమ్మ (45) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున మృతి చెందిన పెండ్రి అప్పలమ్మ మృతదేహాన్ని బంధువులు సాధారణ మరణంగా భావించి ఖననం చేశారు. అయితే ఖననం చేసిన అప్పలమ్మ మృతదేహాన్ని సోమవారం గాజువాక తహశీల్దార్ జేమ్స్ ప్రభాకర్, పోలీసులు, రెవెన్యూ అధికారులు, బంధువుల సమక్షంలో వెలికి తీసి విశాఖపట్నం కేజీహెచ్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అండ్ ఎన్స్‌పోర్స్‌మెంట్ ఉన్నతాధికారి హరికుమార్‌తో పాటు ఇతర ఎక్సైజ్ అధికారులు సోమవారం ఎస్టీ కాలనీకి వచ్చారు. దీంట్లో భాగంగా కెమికల్ డబ్బా దొరికిన ప్రాంతానికి బాధిత కుటంబీకులతో కలిసి వెళ్లారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే కెమికల్‌తో కూడిన డబ్బా డంపింగ్‌యార్డ్‌లో లభించలేదని నిర్థారణకు వచ్చారు. డంపింగ్‌యార్డ్‌కు సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద గల తుప్పల్లో కెమికల్‌తో కూడిన డబ్బా లభించినట్లు బాధితులు ఎక్సైజ్ అండ్ ఎన్స్‌పోర్స్‌మెంట్ అధికారులకు తెలియజేశారు. దీంట్లో భాగంగా ఎన్స్‌పోర్స్‌మెంట్ అధికారులు మరోసారి కెమికల్ శాంపిల్స్‌ను సేకరించి నిర్థారణ కోసం హైదరాబాద్‌లో గల కెమికల్ ల్యాబ్‌కు తరలించినట్లు తెలిపారు. సోమవారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు.