క్రైమ్/లీగల్

సుప్రీం ముందుకు నేడు ‘అయోధ్య’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయంగా మరింత సున్నిశితంగా మారిన రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన కేసును సుప్రీం కోర్టు మంగళవారం విచారించబోతోంది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు ఎస్‌ఏ బాబ్డే, డివై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్. అబ్దుల్ నజీర్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ముందుకు ఈ కేసు రాబోతోంది. నిజానికి ఈ కేసు విచారణ గతనెల 29నే జరగాల్సి ఉన్నప్పటికీ న్యాయమూర్తి బాబ్డే ఆరోజు అందుబాటులో లేకపోవడం వల్ల విచారణను సుప్రీం కోర్టు రద్దుచేసింది. అలహాబాద్ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మొత్తం 14 అప్పీళ్లు దాఖలయ్యాయి. అయోధ్యలో ఉన్న 2.77 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌బోర్డ్, నిర్మూహీ అఖారా, రామ్‌లీలా సంస్థలకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ప్రధాన అంశంతో పాటు విడివిడిగా దాఖలైన వివిధ పిటిషన్లను కూడా సుప్రీం కోర్టు విచారించనుంది.