క్రైమ్/లీగల్

శ్రీధరణి మృతిపై దర్యాప్తు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామవరపుకోట, ఫిబ్రవరి 25: పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం గుంటుపల్లి బౌద్ధ ఆరామాల వద్ద ఆదివారం రాత్రి శ్రీ్ధరణి అనే డిగ్రీ విద్యార్థిని దారుణ హత్యకు గురైన ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఆ యువతి వెంట ఉన్నట్లుగా భావిస్తున్న నవీన్ అనే యువకుడు సైతం తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉండగా గుర్తించిన సంగతి విదితమే. కాగా జిల్లా అడిషినల్ ఎస్పీ ఈశ్వరరావు సోమవారం ఉదయం నుంచి సంఘటనాస్థలంలో ఉండి ఆధునిక టెక్నాలజీ సాయంతో దర్యా ప్తు కొనసాగించారు. కామవరపుకోట ఎస్సై సతీష్‌కుమార్ , జంగారెడ్డిగూడెం ఎస్సై ఎదుర్గారావు, టి.నర్సాపురం ఎస్సై రాంబాబు, చింతలపూడి ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. యువతి హత్య జరిగిన సమయానికి ఆ ప్రదేశంలో పనిచేసిన సెల్‌ఫోన్ నెంబర్లపై నిఘావుంచి, కొందరిని అనుమానితులుగా గుర్తించినట్టు తెలియవచ్చింది. ఈ సందర్భంగా జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇద్దరిని, కామవరపుకోటకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీ సుకుని ప్రశ్నిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలియవచ్చిం ది. అలాగే గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఒకరిని తీసుకుని ఆదివారం సా యంత్రం సందర్శనకు వచ్చిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అలాగే ఏలూరు నుం డి వచ్చిన క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ కూడా వివరాలు సే కరించే పనిలో నిమగ్నమైంది. త్వరలోనే పూ ర్తి వివరాలు వెల్లడిస్తామని అడిషినల్ ఎస్పీ ఈశ్వరరావు తెలిపారు. కాగా తమకు న్యాయం చేయాలంటూ ఏ లూరు ప్రభుత్వాసుపత్రి వద్ద శ్రీ్ధరణి బంధువులు ఆందోళన చేశారు. ఈ ఘటనకు నవీనే కారణమని వా రు ఆరోపించారు. వచ్చే నెలలో నిశ్చితార్థం జరగనున్న తమ కుమార్తె తమను వీడిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు శ్రీ్ధరణి తరపువారే కారణమని నవీన్ బంధువులు ఆరోపించారు.