క్రైమ్/లీగల్

జూనియర్ లైన్‌మెన్ నియామకాలు చెల్లుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2006లో విద్యుత్ సంస్థలు భర్తీ చేసిన జూనియర్ లైన్‌మెన్ల నియామకాలకు సుప్రీం కోర్టు ఒకే చెప్పింది. జూనియర్ లైన్‌మెన్ల నియామకాలపై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను జస్టిస్ లావు నాగేశ్వరావు, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. విద్యుత్ సంస్థలు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాయని దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం సోమవారం తుది తీర్పును వెలువరించింది. 7114 జూనియర్ లైన్‌మెన్ల పోస్టుల భర్తీపై గతంలో ఉమ్మడి హైకోర్టు రెండు వేర్వేరు ఆదేశాలిచ్చింది. విద్యుత్ సంస్థల నోటిఫికేషన్ల మేరకు భర్తీ చేసిన ఈ నియామాకాలు పునఃపరిశీలించాలని హైకోర్టు పేర్కొనడం సరైనది కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.