క్రైమ్/లీగల్

బాయిలర్ పేలి నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో సోమవారం రాత్రి ఓ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మండల పరిధిలో నాయకులగూడెం సమీపంలోని ఓ మొక్కజొన్న విత్తన తయారీ పరిశ్రమలో సోమవారం రాత్రి 8గంటల సమయంలో బాయిలర్ పేలటంతో ఆ సమయంలో పనిచేస్తున్న కూలీల్లో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీలుగా చెబుతున్నారు. ఇంతేకాక సమీప గ్రామమైన కారులగూడెం గ్రామానికి చెందిన పలువురు ఆచూకీ లభ్యం కాకపోవటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన నలుగురు కూలీలు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. వీరి వాహనాలన్నీ పరిశ్రమ వద్ద ఉండగా, వీరి ఫోన్లు పనిచేయకపోవటంతో వీరు కూడా ప్రమాదానికి గురై ఉంటారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీహార్‌కు చెందిన ముఖేష్‌కుమార్ (25), సంతోష్ జాదవ్ (25) మృతి చెందినట్లు తెలియగా, మరో ఇద్దరు మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఏడాది క్రితం ఈ పరిశ్రమను స్థాపించారు. పరిశ్రమ యజమాని మురళీకృష్ణతో పాటు మరో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. వీరందరినీ సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా లేకపోవటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. సత్తుపల్లి, కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. ఐతే ఈ పరిశ్రమలో మరో బాయిలర్ పేలే అవకాశం ఉందని అటు వైపు పోలీసులు ఎవరినీ అనుమతించటం లేదు. తెల్లవారే సమయానికి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూలీలు చెబుతున్నారు. సత్తుపల్లి ఏసీపీ ఆంజనేయులు, వీఎం బంజర్, కయ్యూరు ఎస్‌ఐలు నాగరాజు, పవన్‌కుమార్ హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు ప్రారంభించారు. ఖమ్మం సీపీ తఫ్సీర్ ఇక్బాల్ కూడా ప్రమాద స్థలికి చేరుకునే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.