క్రైమ్/లీగల్

27లోగా వీడియో ఫుటేజీ సమర్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: ఈ నెల 12వ తేదీన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా చో టుచేసుకున్న ఘటనలపై వీడియో ఫుటేజీ సమర్పించేందుకు ఈ నెల 27వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ ఫుటేజీని శాసనసభ న్యాయ, లెజిస్లేచర్ శాఖ సమర్పిస్తుం ది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకరరావు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్‌ఏ సంపత్‌కుమార్ తమ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దుచేయడాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు వాదనలు వినిపించారు. వీ డియో ఫుటేజీ సమర్పించేదుకు గడువు కావాలని అభ్యర్థించారు. వీడియో ఫుటేజీ ఇచ్చేందుకు అ సెంబ్లీ తీర్మానం అవసరమని, ఆయన కోర్టుకు తె లిపారు. ఈ మేరకు అడ్వకేట్ జనరల్ అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారని ఆయన కోర్టుకు తెలిపారు. అనంతరం కోర్టు ఈ కేసు విచారణను వాయిదా వేసింది.