క్రైమ్/లీగల్

మావల సర్పంచ్ రఘుపతి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,మార్చి 22: ఆదిలాబాద్ పట్టణంలో ఈనెల 1న ఇరువర్గాల మద్య జరిగిన ఘర్షణ కేసులో తప్పించుకు తిరుగుతున్న మావల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఉష్కం రఘుపతిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు గురువారం టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆదిలాబాద్ డిఎస్పీ నర్సింహారెడ్డి వివరాలు వెల్లడించారు. ఈనెల 1వ తేదీన స్థానిక రిమ్స్ ఆసుపత్రిలో నాకోడ్ ప్రమోద్ అనే వ్యక్తిని తీవ్రంగా కొట్టి గాయపర్చిన కేసులో ప్రధాన నిందితులైన వసీం, ఇబ్రహీం, సాజిద్‌తో పాటు మావల సర్పంచ్ ఉష్కం రఘుపతిపై హత్యాయత్నం కేసులు నమోదు కాగా అప్పటి నుండి నిందితులు పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నారు. నిందితులను అరెస్ట్ చేయాలని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు సైతం జిల్లా ఎస్పీని కలిసి గతంలోనే వినతి పత్రాన్ని సమర్పించారు. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశాల మేరకు డిఎస్పీ అధ్వర్యంలో పోలీసు బృందాలు గాలింపు జరుపుతుండగా గురువారం ఉదయం దాడి కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న మావల సర్పంచ్ రఘుపతి 20 రోజుల తర్వాత కారులో హైదరాబాద్ నుండి ఆదిలాబాద్‌కు వస్తున్నాడు అన్న సమాచారం మేరకు మావల వద్ద పోలీసులు కాపుకాసి అరెస్ట్ చేయడం జరిగిందని డి ఎస్పీ వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘర్షణ కేసులో ప్రధాన నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతుందని, రఘుపతి దాడి ఘటనలో ప్రత్యేక్షంగా లేకపోవడంతో పాటు ప్రధాన నిందితుడు ఏ1 వసీం ఇంత వరకు అరెస్ట్ కానందునా వసీం అరెస్ట్ అయ్యే వరకు తాత్కలికంగా బెయిల్ మంజూరు చేయడం జరిగిందన్నారు. త్వరలోనే దర్యాప్తు ముమ్మరం చేసి వసీం వాగ్మూలం సేకరించిన అనంతరం మిగితా నిందితులను కూడా అరెస్ట్‌చేస్తామని తెలిపారు. సిసి ఎస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని, కేసు పురోగతిలో ఉందని డిఎస్పీ నర్సింహారెడ్డి వివరించారు. ఈ విలేకర్ల సమావేశంలో గ్రామీణ సిఐ ప్రదీప్‌కుమార్, మావల ఎస్సై అనిల్, టూటౌన్ ఎస్సై జగన్మోహన్ రెడ్డి, విష్ణు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.