క్రైమ్/లీగల్

తాజా ఆదేశాలు అవసరం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలోని ఏ ప్రాంతంలోనూ ఫిబ్రవరి 22వ తేదీ తరువాత కాశ్మీరీలపై దాడి జరగలేదని కేంద్ర ప్రభుత్వం తెలియచేసినందున ఈ అంశానికి సంబంధించి తాజాగా ఆదేశాలు జారీ చేయవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాద ఆత్మాహుతి బాంబుదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన తరువాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో కాశ్మీరీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా దాఖలయిన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ విషయం తెలిపింది. కాశ్మీరీలపై బెదిరింపులు, సామాజిక బహిష్కరణలు, హింస వంటి వాటిని నిరోధించడానికి సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఫిబ్రవరి 22న 11 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. అతున్నత న్యాయస్థానం జోక్యం చేసుకున్న తరువాత దేశంలోని ఏ ప్రాంతంలోనూ కాశ్మీరీలపై దాడి జరగలేదని ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ బుధవారం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. న్యాయమూర్తులు ఎల్.ఎన్.రావు, సంజీవ్ ఖన్నా ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఫిబ్రవరి 22వ తేదీ తరువాత దేశంలోని ఏ ప్రాంతంలోనూ కాశ్మీరీలపై హింస జరుగనందున ప్రస్తుత పరిస్థితుల్లో అదనపు ఆదేశాలు ఇవ్వవలసిన అవసరం లేదని భావిస్తున్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.