క్రైమ్/లీగల్

నగల కోసం మహిళ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 27: నగరంలో ఒంటరిగా ఉంటున్న ఓ మహిళ హత్యకు గురైన సంఘటన బుధవారం వెలుగుచూసింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. స్థానిక నేతాజీనగర్‌లో డక్కిలి వసంతకుమారి అనే మహిళ ఒంటరిగా నివసిస్తున్నారు. రెవెన్యూ ఉద్యోగిగా రిటైర్ అయిన ఆమె అవివాహిత కావడంతో ఒంటరిగానే నేతాజీనగర్‌లోని తన స్వగృహంలో నివసిస్తున్నారు. వెంకటగిరిలో బంధువుల ఇంటిలో ఈనెల 26న జరగాల్సిన కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ఆమె మంగళవారం ఉదయం తమ బంధువులకు సమాచారమిచ్చారు. అయితే ఆమె హాజరుకాలేదు. వసంతకుమారి సెల్‌ఫోన్‌కు కుటుంబీకులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎటువంటి స్పందన లేదు. మంగళవారం రాత్రి మరోసారి ప్రయత్నించినా ఎటువంటి స్పందన లేకపోయేసరికి బుధవారం ఉదయం వసంతకుమారి సోదరుడు నేతాజీనగర్‌లోని ఆమె ఇంటికి వచ్చి చూసేసరికి వసంతకుమారి ఇంట్లో విగతజీవిగా పడి ఉన్నారు. ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. వెంటనే వేదాయపాలెం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న నగర డి ఎస్పీ మురళీకృష్ణ, సి ఐ నరసింహారావు సంఘటన జరిగిన తీరుతెన్నులను పరిశీలించారు. ఒంటరిగా మహిళ నివసిస్తున్నట్లు తెలుసుకున్న వ్యక్తులే ఆమె వద్ద గల నగల కోసం హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే మృతురాలికి ఏవైనా ఆర్థిక లావాదేవీలు, ఎవరితోనైనా ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయేమోననే కోణంలో కూడా దర్యాప్తు సాగిస్తున్నారు.
మృతురాలి ముఖం ఉబ్బిపోయి ఉండడంతో మంగళవారం మధ్యాహ్నం ప్రాంతంలో ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సుమారు 10సవర్ల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు మృతురాలి బంధువులు ఫిర్యాదులో పేర్కొన్నారు. క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. డి ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ చోరీ కోసమే హత్య చేసినట్లు భావిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ప్రధానాసుపత్రికి తరలించి వేదాయపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.