క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో టౌన్ ప్లానింగ్ ఏసీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఫిబ్రవరి 27: ఓ వ్యాపారి నుంచి రూ.20 వేలు లంచం తీసుకున్న కర్నూలు నగర పాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ విభాగం అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) శాస్ర్తీ షబ్నంను ఏసీబీ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
నగరానికి చెందిన పవన్‌కుమార్ తాను కొనుగోలు చేసిన ప్లాట్‌లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే రూ.20 వేలు లంచం ఇస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తానని అసిస్టెంట్ సిటీప్లానర్ శాస్ర్తీ చెప్పారు. దీంతో లంచం ఇవ్వడం ఇష్టంలేని పవన్‌కుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు బుధవారం రూ.20 వేలు అసిస్టెంట్ సిటీ ప్లానర్ శాస్ర్తీకి అందచేస్తుండగా ఏసీబీ డీఎస్పీ జయరామ రాజు అదుపులోకి తీసుకున్నారు.