క్రైమ్/లీగల్

పళని వర్గానికే ‘ఏఐఏడీఎంకే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: తమిళనాడులో జయలలిత వర్గం నేతలు శశికళ, టీటీవీ దినకరన్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఏఐఏడీఎంకే పార్టీ, ఎన్నికల గుర్తు రెండాకులు తమకే ఇప్పించాలన్న అభ్యర్థను కోర్టు తోసిపుచ్చింది. స్పష్టమైన మెజారిటీ ఉన్న పళనిస్వామి వర్గానికే అన్నాడీఎంకే, రెండాకుల గుర్తు చెందుతాయని కోర్టు ప్రకటించింది. 2017 నవంబర్ 23న కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది. జస్టిస్ జీఎస్ సిస్టానీ, జస్టిస్ సంగీత ధింగ్రా సెహగల్‌తో కూడిన ధర్మాసనం శశికళ, దినకరన్ పిటిషన్‌ను కొట్టివేసింది. గతంలో అన్నాడీఎంకే పార్టీ, ఎన్నికల గుర్తును పళనిస్వామి, పన్నీర్ సెల్వం గ్రూపునకు ఈసీ కేటాయించింది. శశి, దినకరన్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. కాగా ఎన్నికల గుర్తు ప్రెషర్ కుక్కర్ ఎవరికీ కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు.దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించ దలిచామని కాబట్టి ఈసీ 15 రోజుల పాటు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆదేశాలివ్వాలని ఆయన అభ్యర్థించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి నాయకత్వంలోని అన్నాడీఎంకే నుంచి శశికళ, దినకరన్‌ను బహిష్కరించిన సంగతి తెలిసిందే. దీంతో అమ్మా మక్కల్ మునె్నట్ర కజగం(ఏఎంఎంకే) పేరుతో దినకరన్ సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.