క్రైమ్/లీగల్

రెండు వారాల్లోగా దేశం విడిచివెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: రెండు వారాలలోగా దేశం విడిచి వెళ్లిపోవలసిందిగా ఢిల్లీ హైకోర్టు గురువారం ఒక పాకిస్తాన్ మహిళను ఆదేశించింది. చట్ట ప్రకారం భారత్‌లో ఉండటానికి వీలు లేదని, అందువల్ల భారత్‌ను విడిచి వెళ్లాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ ఆ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విభు బఖ్రు కొట్టివేశారు. 37 ఏళ్ల పాకిస్తాన్ మహిళ ఒక భారత పురుషుడిని వివాహమాడి 2005లో భారత్‌కు వచ్చింది. భర్త, 11, 5 ఏళ్ల వయసు గల ఇద్దరు కుమారులతో కలిసి ఆమె ఢిల్లీలో నివసిస్తోంది. ఆ మహిళకు సంబంధించి భద్రతా సంస్థల నుంచి ప్రతికూలమయిన రిపోర్ట్‌లు వచ్చినందున ఆమెను దేశం విడిచి వెళ్లవలసిందిగా ఆదేశిస్తూ నోటీసు జారీ చేయడం చట్టవ్యతిరేకం కాదని అదనపు సొలిసిటర్ జనరల్ మనీందర్ ఆచార్య, కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌనె్సల్ అనురాగ్ అహ్లూవాలియా కోర్టుకు తెలిపారు. అధికారుల వద్ద గల సమాచారాన్ని పరిశీలించడం జరిగిందని, ప్రభుత్వం జారీ చేసిన నోటీసు ఏకపక్షమని ఆ మహిళ చేస్తున్న వాదనతో ఏకీభవించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ మహిళ భారత్‌లో ఉండటానికి తనకు హక్కుందంటూ ఎలాంటి ఆధారాలను చూపించలేదని, అందువల్ల ఆమె దేశం విడిచి వెళ్లాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 22వ తేదీలోగా దేశం విడిచి వెళ్లాలని ఆ మహిళకు నోటీసు జారీ చేసింది. అయితే, సుప్రీంకోర్టు ఈ గడువును పెంచుతూ రెండు వారాలలోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.