క్రైమ్/లీగల్

ఐదు ఇళ్లలో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, ఫిబ్రవరి 28: తాళం వేసిన ఐదు ఇళ్లలో దొంగ తనం జరిగిన సంఘటన పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని బసిరెడ్డిపల్లిలో గురువారం వెలుగులోకి వచ్చింది. బసిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు తాళాలు వేసిన ఐదు ఇళ్లలో దొంగతనం చేశారు. రాత్రి సమయంలో ఇంట్లో ఉబ్బరం ఉండటంతో ఇంటికి తాళం వేసి స్లాబ్‌పై పడుకున్నారు. ఒకరిద్దరు వ్యక్తులు తమ బంధువుల ఇంటి దగ్గర పెళ్లి గురించి వెళ్లారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు చోరీ చేశారు. 10 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ. లక్ష 20 వేలు చోరీ జరిగినట్లు బాధితులు తెలిపారు. పోలీస్ కేసు నమోదు చేశారు.